మానవత్వం చాటుకున్న కారుమూరి
తణుకు అర్బన్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వృద్ధుడికి మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తన సిబ్బందితో సపర్యలు చేయించి సురక్షితంగా ఆస్పత్రికి పంపించిన సంఘటన తణుకు మండలం వేల్పూరులో గురువారం చోటుచేసుకుంది. వేల్పూరుకు చెందిన వృద్ధుడు టీవీఎస్ మోపెడ్ పై ఓ మహిళను ఎక్కించుకుని తణుకు వైపునకు వస్తుండగా తణుకు వైపు నుంచి వస్తున్న కారు ఆయన్ను ఢీకొట్టింది. ఇదే సమయంలో అటుగా వెళుతున్న కారుమూరి స్వల్పంగా గాయపడ్డ వృద్ధుడిని సముదాయించి ప్రమాదానికి కారకులైన కారులో ఉన్న వారితో వృద్ధుడిని ఆస్పత్రిలో చికిత్స చేయించాల్సిందిగా చెప్పి అదే కారులో ఎక్కించి పంపించారు. వైఎస్సార్‌సీపీ పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్ ఉన్నారు.
మున్సిపల్ అధికారులపై చర్యలు
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం మున్సిపాలిటీ లో పన్ను విధింపునకు సంబంధించి అధికారులపై చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. పట్టణంలోని ఓ ఖాళీ స్థలానికి సంబంధించి పత్రాలు, స్థల పరిశీలన చేయకుండా పన్ను విధించిన వ్యవహారంలో ము న్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన ఎస్.శివరామకృష్ణ, ఆర్వో డి.సోమశేఖర్, ఆర్‌ఐ ఎస్.కృష్ణమోహన్, వా ర్డు వెల్ఫేర్ సెక్రటరీ పి.చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ (సీడీఎంఏ)కు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.


