మోదీ ఉక్రెయిన్‌ పర్యటన.. జెలెన్‌స్కీ భుజంపై చేతులు వేసి.. | Modi meets Zelensky amid Russia Ukraine war | Sakshi
Sakshi News home page

మోదీ ఉక్రెయిన్‌ పర్యటన.. జెలెన్‌స్కీ భుజంపై చేతులు వేసి..

Published Fri, Aug 23 2024 4:24 PM | Last Updated on Fri, Aug 23 2024 4:41 PM

Modi meets Zelensky amid Russia Ukraine war

కీవ్‌ : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. భేటీలో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి జెలెన్‌స్కీ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మోదీని అలిగనం చేసుకొని అక్కడి నుంచి రష్య దాడిలో మరణించిన చిన్నారుల స్మారక ప్రాంతానికి తీసుకొళ్లారు. వెళ్లే సమయంలో జెలెన్‌స్కీ భుజంపై చేతులు వేసిన మోదీ ఆత్మియంగా పలకరిస్తూ ముందుకు సాగారు. అక్కడ మరణించిన చిన్నారులకు మోదీ నివాళులర్పించారు.

ఆ తర్వాత రష్యా దాడితో దెబ్బతిన్న ఉక్రెయిన్‌లో ఎలాంటి పరిణామలు చోటు చేసుకున్నాయి. ఎంత మేరకు చిన్నాభిన్నామైందో తెలుపుతూ స్థానిక మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను వీక్షించారు. కాగా, రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభం పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.    అంతకుముందు రెండు రోజుల పోలెండ్‌ పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి 10 గంటల పాటు రైల్‌ఫోర్స్‌ వన్‌ రైలులో ప్రయాణించి ఉక్రెయిన్‌ చేరుకున్నారు.

 రష్యా పర్యటన.. వెనువెంటనే ఉక్రెయిన్‌కు మోదీ
రష్యా- ఉక్రెయిన్‌.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న దేశాలు. అలాంటి దేశాల మధ్య యుద్ధం ఆపే దిశగా ప్రధాని మోదీ శాంతిమంత్రమెయ్యాలని చూస్తున్నారు. అందుకే రష్యాలో పర్యటించిన ఆరు వారాల తర్వాత ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. 22వ ఇండియా-రష్యా శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ ఆహ్వానంతో ఈ ఏడాది జులై 8న మాస్కోలో పర్యటించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా పుతిన్‌ను మోదీ ఆత్మీయంగా అలింగనం చేసుకోవడం, వారిరువురూ ఆప్యాయంగా మాట్లాడుకున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో మోదీ రష్యా వైపు ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

మోదీ తీరుపై జెలెన్‌స్కీ ఆగ్రహం
మోదీ రష్యా పర్యటించిన రోజే కీవ్‌లోని ఓ ఆస్ప్రతిలో దాడి జరిగింది. రష్యా జరిపిన దాడిలో 37 మంది చిన్నారులు మృతి చెందారు. వారి మరణంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జెలెన్‌స్కీ మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నాయకుడు అక్కడికి వెళ్లి ప్రపంచంలోని అతిపెద్ద క్రిమినల్‌ను కౌగిలించుకోవడం చాలా బాధకరం అని వ్యాఖ్యానించారు.

అయినప్పటికీ సమస్యను పరిష్కరించుకోవాలంటే ఘర్షణకు దిగకుండా.. చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని మొదటి నుంచి రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య సఖ్యత కోరుకుంటున్న మోదీ.. తాజా ఉక్రెయిన్‌లో పర్యటించడంపై ప్రపంచ దేశాలు తాజాగా పరిణామాల్ని ఆసక్తికరంగా గమనిస్తున్నాయి.

జెలెన్‌స్కీతో ప్రధాని మోదీ రెండో సారి భేటీ
జెలెన్‌స్కీతో ప్రధాని మోదీ రెండో సారి భేటీ అయ్యారు. తొలిసారి ఈ ఏడాది ఇటలీలోని అపులియాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సందర్భంగా జెలెన్‌స్కీని కలిశారు. ఆ సమావేశంలో ఉక్రెయిన్‌-రష్యా మధ్య నెలకొన్న సమస్యల్ని పరిష్కరించేందుకు భారత్‌ తన శక్తిమేర ప్రయత్నిస్తోందని, చర్చలు-దౌత్యం ద్వారా  శాంతికి మార్గం ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌లో వివాదానికి పరిష్కారం కనుగొనడంలో భారత్‌ చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని జెలెన్‌స్కీకి ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement