Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YSRCP Chief AP EX CM YS Jagan Press Meet Speech July 16th News Updates1
వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ పూర్తి హైలైట్స్‌

సాక్షి, గుంటూరు: ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొడుతున్న తీరును.. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన పరిస్థితులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడుల పర్వం, అక్రమ కేసులు.. అరెస్టులపై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మాట్లాడారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ.. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.రాష్ట్రంలో ఇటీవల చంద్రబాబు కుట్రల నేపథ్యం. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్న వైఖరి. పొలిటికల్‌ గవర్నెన్స్‌ నడిపిస్తున్న తీరు.. ఇవన్నీ రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో రాజ్యాంగం ఉనికి, చట్టం కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, పలుకుతోంది వైయస్సార్‌సీపీ మాత్రమే. ఎవరికి ఏ కష్టం వచ్చినా.. రైతులు, అక్కచెల్లెమ్మలు, నిరుద్యోగులు, విద్యార్థులు.. చివరకు ఉద్యోగులకు కష్టం వచ్చినా కూడా వైయస్సార్‌సీపీనే ప్రశ్నిస్తోంది. ఇంకా అధికారం కోసం చంద్రబాబు ఇచ్చిన అడ్డగోలు హామీలు. మోసం చేసిన విధానం. వాటిని ఆ మోసాలు ఎండగడుతూ ప్రశ్నిస్తున్న పార్టీ కూడా ఒక్క వైయస్సార్‌సీపీ మాత్రమే. ప్రతిపక్షంగా ఒక పార్టీ ఉన్నప్పుడు, ఆ పార్టీ ప్రజల అభిప్రాయాలు సమీకరించడం, ప్రజలకు సంఘీభావంగా వారితో గొంతు కలపడం, వారికి తోడుగా నిలబడడం ధర్మం కూడా ప్రతిపక్షానిదే.అందుకే వరసగా కార్యక్రమాలు:ఏడాది నుంచి చంద్రబాబుగారు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అందుకే రైతులకు గిట్టుబాటు ధర కోసం, వారికి పెట్టుబడి సాయం అందకపోవడం, ఉచిత పంటల బీమాను ఎత్తివేసిన పరస్థితి, లేని ఇన్‌పుట్‌ సబ్సిడీ అన్నింటిపై 2024, డిసెంబరు 13న వైయస్సార్‌సీపీ రాష్ట్రంలో ధర్నా కార్యక్రమం చేశాం.కరెంటు ఛార్జీల బాదుడుపై గత డిసెంబరు 24న రాష్ట్రంలో నిరసన కార్యక్రమం. ఏడాదిలోనే రూ.15 వేల కోట్లకు పైగా బాదుడుపై నిరసన కార్యక్రమం. పోరుబాట నిర్వహించాం. పిల్లల చదువులతో చంద్రబాబు చెలగాటం. విద్యాదీవెన, వసతిదీవెన ఎగ్గొట్టిన వైనం. వాటన్నింటిపై మార్చి 12, యువతపోరు నిర్వహించాం. నిరుద్యోగ భృతి గురించి కూడా ప్రశ్నించాం.జూన్‌ 4న రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు మోసాలు వివరిస్తూ, వెన్నుపోటు దినం నిర్వహించాం. చంద్రబాబుగారు ఎగ్గొట్టిన బాకీలు అడిగాం. ఆరోజు రాష్ట్రమంతా కార్యక్రమం.ఇప్పుడు కూడా బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ అన్న నినాదంతో, ‘రీకాలింగ్‌ ఆఫ్‌ చంద్రబాబూస్‌ మ్యానిఫెస్టో’ పేరుతో చంద్రబాబు మోసాలు ఎత్తి చూపుతూ, ప్రజలను చైతన్యులను చేస్తూ.. నాడు చంద్రబాబు ఇచ్చిన బాండ్లు టీడీపీ నాయకులకు చూపిస్తూ, ప్రభుత్వం పడిన బకాయిలు అడుగుతూ రాష్ట్రమంతా కార్యక్రమం కొనసాగుతోంది.జూలై (ఈనెల) 21 నుంచి గ్రామస్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి గ్రామంలో అందరినీ చైతన్యులను చేసే దిశగా కార్యక్రమం నిర్వహిస్తాం.తట్టుకోలేక వేధింపుల పర్వం:చంద్రబాబుపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది. ఆయన ఏదీ చేయడని చెప్పి, వైయస్సార్‌సీపీ తలుపు తడుతున్నారు. ఎందుకంటే, వచ్చేది మన ప్రభుత్వమే అని అందరికీ తెలుసు. దీన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తున్నాడు. మా హయాంలో పోలీసులు అత్యుత్తమ పోలీసులుగా, పీపుల్స్‌ ఫ్రెండ్లీగా ఉండే వారు. స్పందన కార్యక్రమంలో మా పార్టీ వారి కంటే ఎక్కువగా టీడీపీ వారి సమస్యలు పరిష్కరించేవారు. అదే ఈరోజు ఆ అధికారుల పరిస్థితి ఏమిటంటే.. చంద్రబాబుగారి మాట ఏ పోలీసు అధికారి అయినా వినకపోతే.. డీజీ స్థాయి అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇంకా మరో డీజీపీ స్థాయ అధికారి సునీల్‌కుమార్, మరో అధికారులు సంజయ్, కాంతిలాల్‌రాణ టాటా, విశాల్‌గున్నీ.. అందరిపై తప్పుడు కేసులు వేధింపులు. బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతి రాణా టాటా తదితరులను తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్‌ చేయించారు. మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారు. వీరు కాక నలుగురు నాన్‌ కేడర్‌ ఎస్పీలు, ఒక కమాండెంట్‌ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్‌ ఎస్పీలు, 55 మంది డీఎస్పీలకు పోస్టింగ్‌లు లేవు. మరో ఆరుగురు డీఎస్పీలు, మూడు అడిషినల్‌ కమాండెంట్‌లు, రెండు అసిస్టెంట్‌ కమాండెంట్‌లను కూడా హెడ్‌ క్వార్టర్స్‌లో రిపోర్టింగ్‌ చేయిస్తున్నారు. 8 మంది డీఎస్పీలను సస్పెండ్‌ చేశారు. వీరు కాకుండా మరో 80 నుంచి 100 మంది ఇన్‌స్పెక్టర్లు, వందల మంది కానిస్టేబుళ్లు వీఆర్‌లో ఉన్నారు. చంద్రబాబు మాట వినని పోలీసుల పరిస్థితి. రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తోందని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. కేవలం తన మోచేతి నీళ్లు తాగే అధికారులను మాత్రమే పెట్టుకుని వారిని అవినీతిలో భాగస్వాములను చేసుకుంటున్నారు.జగన్‌ ప్రెస్‌మీట్‌ హైలైట్స్‌కొందరు అధికారుల అధికార దుర్వినియోగం:ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే డీఐజీలు కేంద్రంగా కొందరు అధికారులు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల కొందరు ఆ జోన్‌కి మాఫియా డాన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన కింద సీఐలు, ఒక డీఎస్పీ ఆయన ఆర్మీ. నియోజకవర్గంలో జరిగే ఇసుక, మద్యం బెల్టు షాపులు, వాటికిచ్చే పర్మిషన్, పేకాట క్లబ్బులు, నడిచే పరిశ్రమల నుంచి డీఐజీల ఆధ్వర్యంలో సీఐలు కప్పం వసూలు చేసి రివర్స్‌లో ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు. సగం వీళ్లు తీసుకుని మరోసగం చినబాబు, పెదబాబుకి పంపుతారు. ఇవన్నీ తట్టుకోలేక సిద్దార్థ కౌశల్‌ వంటి యంగస్టర్, యంగ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ రాజీనామా చేసి వెళ్లిపోయాడు. కేంద్రానికి వెళ్లడానికి ఎన్వోసీ ఇవ్వకపోవడంతో చంద్రబాబుతో పడలేక రాజీనామా చేసి వెళ్లిపోయాడు. – ఏ ప్రభుత్వంలో అయినా పోలీస్‌ వ్యవస్థ గట్టిగా ఉంటే, నేరస్తులు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతారు. కానీ ఇక్కడ మాత్రం మంచి పోలీసులు రాష్ట్రాన్ని వదిలేసి వెళ్లిపోతున్నారు. యథేచ్ఛగా దాడుల పర్వం:కృష్ణా జిల్లా గుడివాడలో జడ్పీ ఛైర్మన్‌. బీసీ. నా సోదరి హారిక. టీడీపీ సైకోలు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అసలు ఆమె చేసిన తప్పేమిటి? ఎందుకు ఆమె మీద దాడి చేశారు? ఎందుకు దుర్భాషలాడారు?. చంద్రబాబు చేసిన మోసాలు నిలదీయడం తప్పా? రీకాలింగ్‌ ఆఫ్‌ చంద్రబాబూస్‌ మ్యానిఫెస్టో’ కార్యక్రమానికి ఆమె వెళ్తుంటే దాడి చేశారు. సా.5 గం.కు దాడి మొదలై, 6.30 వరకు కొనసాగింది. ఆమెను, ఆమె భర్తను కారులో ఉంచి తిడుతూ, కొడుతూ, కారు అద్దాలు ««ధ్వంసం చేశారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరిగినా, వారు ప్రేక్షకపాత్ర పోషించారు.చంద్రబాబుగారిని అడుగుతున్నా.. ఆమె బీసీ మహిళ. ఆమెను తిడుతూ, అనరాని మాటలు అనాల్సిన అవసరం ఏముంది? దారి కాచి దాడి చేయడం సబబేనా? ఇది శాడిజమ్‌ కాకపోతే మరేమిటి?. ఇంత హేయమైన దాడి చేసి, సిగ్గు లేకుండా దుర్భాషలాడి, ఒక బీసీ మహిళ, నా చెల్లి హారికను టీడీపీ వారు మహానటి అంటున్నారు. కనీసం సిగ్గుందా? అన్నీ చేసిన మీరు ఆమెను మహానటి అంటారా? (అంటూ.. ఆ వీడియో ప్రదర్శించి చూపారు. హారికపై టీడీపీ మూకల దాడి దృశ్యాలు).పోలీసులు దగ్గరుండి, వారి సమక్షంలో జడ్పీ ఛైర్మన్‌పై దాడి. మహిళ. ఆమెను మహానటి అని రివర్స్‌ విమర్శ చేస్తున్నారు. అసలు ఎవరు మహానటులు. దాన వీర శూర కర్ణ కన్నా గొప్ప నటన ఆయన చేస్తున్నాడు. ఈ ఘటనలో నాగార్జున యాదవ్‌ అనే మరో జడ్పీటీసీ భర్తను కూడా కొట్టారు. ఇంత స్పష్టంగా ఘటన జరిగితే, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. కారణం ఆ దాడి చేయించింది వారే కాబట్టి. పై నుంచి ఫోన్లు చేసి మరీ ఈ దాడి చేయించారు.ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. కళ్ల ముందు కనిపిస్తున్న వీడియో పక్కనపెట్టి, హారిక భర్త రాముపై కేసు పెట్టారు. ఆయన తన కారుతో ఢీ కొట్టాడని. అది గవర్నమెంట్‌ కారు. నడిపేది గవర్నమెంట్‌ డ్రైవర్‌. ఆ కారులో రాము వెనక సీట్లో కూర్చున్నాడు. ఆయన ఢీ కొట్టాడని కేసు పెట్టారు. వారు బీసీల గురించి మాట్లాడడం సిగ్గుచేటు.ఆ మర్నాడు పెడనలో సమావేశం నిర్వహిస్తే.. పేర్ని నాని, జోగి రమేష్‌ తదితరులపై కేసు పెట్టారు. పార్టీ ఒక క్యాడర్‌ మీటింగ్‌ పెట్టుకోకూడదా?. అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?. పోలీసులు రక్షణ కల్పించడం లేదు సరికదా? వారి సమక్షంలోనే దాడులు జరుగుతున్నా, బాధితులపైనే కేసులు పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమేనా?జగన్‌ ప్రెస్‌మీట్‌ హైలైట్స్‌చంద్రబాబు ప్రతి పనిలోనూ టాపిక్‌ డైవర్షన్‌:నా ప్రతి పర్యటనలో ఆయన చేస్తోంది అదే. దాడులు చేసే ప్రయత్నం. తప్పుడు కేసులు పెట్టించడం. ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చియార్డుకు వెళ్లాను. గత ఏడాది మిర్చి క్వింటా ధర రూ.27 వేలు పలికితే, చంద్రబాబు ప్రభుత్వంలో అది రూ.8 వేలకు పడిపోయింది. ఆ రైతులకు తోడుగా, వారికి మద్దతు ఇస్తూ, మిర్చియార్డుకు పోయింది జగన్‌ మాత్రమే. అది తప్పేనా?. ఆరోజు నా పర్యటనకు నా సెక్యూరిటీ తగ్గించాడు. ఆయనకు మూడ్‌ వస్తే ఇస్తాడు. లేకపోతే జడ్‌ ప్లస్‌ కేటగిరీ తీసేస్తాడు. మళ్లీ మాపైనే కేసు పెట్టారు.ఆ తర్వాత ఏప్రిల్‌లో శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో పర్యటన. మా పార్టీ బీసీ నాయకుడు కురుబ లింగయ్యను దారుణంగా హత్య చేస్తే పరామర్శకు వెళ్లాను. సెక్యూరిటీ ఇవ్వలేదు. దీంతో జనం పోటెత్తి, హెలికాప్టర్‌ విండ్‌షీల్డ్‌ దెబ్బతింది. అక్కడా పైలట్లను వేధించారు. మాపైనా కేసులు పెట్టారు. జూన్‌ 12. పొదిలిలో పర్యటన. పొగాకు ధర దారుణంగా పడిపోయింది. మరోవైపు కొనేవారు లేరు. రైతులు తల్లడిల్లుతుంటే, వారికి సంఘీభావంగా నేను పర్యటించాను. 40 వేలకుపైగా తరలి వచ్చారు. అప్పుడు ఒక 40 మందిని సిద్ధం చేసి దాడులకు వ్యూహరచన చేశారు. వారికి పోలీస్‌ సెక్యూరిటీ ఇచ్చారు. అయినా రైతులు సంయమనం పాటించారు. వారు ఎదురుదాడి చేయలేదు. అయినా 3 కేసులు పెట్టారు. 15 మంది రైతులను జైలుకు పంపారు. మేము రైతులకు అండగా నిలబడితే, నీకొచ్చిన కష్టం ఏమిటి?చంద్రబాబు చేయాల్సింది చేయడు. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులు. కేసులు. అరెస్టులు. జూన్‌ 18న, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో పర్యటన. మా పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే నేను వెళ్తే అడ్డుకోవాలని ప్రయత్నం. నా కోసం ప్రజలు వస్తే, చంద్రబాబుకు ఏం ఇబ్బంది? ఆయన కార్యక్రమానికి జనం రాకపోతే, మాకేం సంబంధం? నా కార్యక్రమానికి రావొద్దని, మా పారీ నాయకులకు నోటీసులు. హౌజ్‌ అరెస్టులు. అలా నా కార్యక్రమానికి జనం రాకుండా కుట్ర. ఇంకా 5 కేసులు నమోదు.ఆ సినిమాలే ఆపేయొచ్చు కదా?:సినిమా డైలాగ్‌లో పోస్టర్లుగా ప్రదర్శిస్తే.. ఇద్దరిని అరెస్టు చేశారు. నీకు ఆ డైలాగ్‌లు నచ్చకపోతే, సెన్సార్‌బోర్డుకు చెప్పి, వాటిని తీసేయించొచ్చు కదా?. నిజానికి బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌ సినిమాల్లో డైలాగ్‌లు ఇంకా దారుణం. సినిమా డైలాగ్‌లు ప్రదర్శిస్తే, కేసులు పెట్టడం ఏమిటి? సినిమాలు ఆపేయండి. ఎవరో ఒకరు సినిమా డైలాగ్‌లు ప్రదర్శిస్తే, వారికొచ్చిన నష్టం ఏమిటి?. ఈ వ్యవహారంలో 131 మందికి నోటీసులు. ఇద్దరిని రిమాండ్‌కు పంపారు. చంద్రబాబు ఎవరి పేరు చెబితే, వారిని పిలిపించడం రోజంతా కూర్చోబెట్టడం.. కేసులు పెట్టడం. ప్రతి ఛార్జ్‌షీట్‌లో ఓ ముగ్గురు, నలుగురి పేర్లు రాసి. అండ్‌ అదర్స్‌ అని రాస్తున్నారు. ఆ తర్వాత తమ టార్గెట్‌లో ఉన్న వారిని అందులో జోడిస్తున్నారు.జగన్‌ ప్రెస్‌మీట్‌ హైలైట్స్‌మామిడి రైతుల కష్టాలు. అక్కడా మాకు వేధింపులు:మామిడి రైతుల సమస్యలపై జూలై 9న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వెళ్లాను. మామిడి ధర దారుణంగా పతనం. మే రెండో వారంలో కొనుగోళ్లు ప్రారంభం కావాల్సి ఉన్నా, జూన్‌ చివరి వరకు పట్టించుకోలేదు. నెల రోజులకు పైగా ఆలస్యం చేశారు. టీడీపీకి సంబంధించిన వారి కంపెనీలు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేశాయి. ఇక్కడ కిలో మామిడి రూ.12 అంటున్నారు. కానీ, ఎంత మందికి ఆ ధర ఇచ్చారు. 6.5 లక్షల టన్నుల పంట. 2.5 లక్షల ఎకరాల్లో సాగు. 76 వేల మంది రైతులకు ఇక్కట్లు. వారికి సంఘీభావంగా నేను అక్కడికి పోవడం తప్పా? ఆ కార్యక్రమంలో రైతులు పాల్గొనడం తప్పా?. 2 వేల మందికి నోటీసులు. వందల మంది అరెస్టు, ముగ్గురు ఎస్పీలు. వందల మంది పోలీసులు. వారంతా నా సెక్యూరిటీ కోసం. ప్రజలు నా కార్యక్రమానికి రాకుండా చూడడం కోసం.చివరకు బైక్‌లకు పెట్రోల్‌ కూడా పోయొద్దని నోటీసులు ఇచ్చారు. ఇన్ని చేసినా వేలాది రైతులు తరలి వచ్చారు. మామిడిని రోడ్ల మీద వేసి, నిరసన వ్యక్తం చేసి, నన్ను కలిశారు. ఆ కార్యక్రమంపై 5 కేసులు పెట్టారు. రైతులు, ప్రతిపక్షాన్ని పట్టుకుని అసాంఘిక శక్తులు, దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం.అందుకు వారు సిగ్గుపడాలి:ఈనాడు చూస్తే దారుణ రాతలు. అది టాయిలెట్‌ పేపర్‌కు ఎక్కువ. టిష్యూ పేపర్‌కు తక్కువ. నాపై రైతులు నిరసన వ్యక్తం చేశారని ఈనాడులో రాశారు. అది ఒక పేపరేనా? మామిడి రోడ్ల మీద వేసిన రైతులపైనా కేసులు పెట్టారు. ఇకపై రాష్ట్రంలో ఏ ఒక్కరూ సమస్యలు ప్రస్తావించొద్దని, వారు రొడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్కరికీ ఉండొద్దని, ఎన్నికలప్పుడు ఇచ్చిన 143 హామీలు అన్నీ నెరవేర్చామని ప్రజలంతా భావించాలంట. లేదని ఎవరైనా ప్రశ్నిస్తే, తప్పుడు కేసులు. వేధింపులు. పాలకుడు అని చెప్పుకోవడానికి చంద్రబాబుకు.. పాత్రికేయం లని చెప్పుకోవడానికి ఎల్లో మీడియాకు సిగ్గుండాలి.ఇది పైశాచికత్వం కాదా?:అనంత జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్మే పెద్దారెడ్డి.. తన సొంత ఇంటికి పోలేకపోతున్నారు. ఆయన ఎప్పుడు పోవాలని చూసినా, పోలీసులే అడ్డుకుంటున్నారు. ఏకంగా గన్‌ చూపిస్తున్నారు. (అంటూ ఆ ఫోటో చూపారు).నెల్లూరు జిల్లాలో 6సార్లు ఎమ్మెల్యే అయిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై ఒక పథకం ప్రకారం, వీరి పచ్చ సైకోలు, పచ్చ శాడిస్టులు పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది, అప్పుడు ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో ఉండి ఉంటే, చంపేసి ఉండేవాళ్లు. (అంటూ పోలీసుల సమక్షంలోనే దాడి దృశ్యాల ప్రదర్శన). అదృష్టవశాత్తూ ప్రసన్న ఇంట్లో లేడు. ఒకవేళ ఆయన ఇంట్లో ఉండి ఉంటే.. దాడి చేసిన వారిపైన కానీ, చేయించిన ఎమ్మెల్యేపై కానీ ఏ చర్య లేదు. కేసు లేదు. కానీ, ప్రసన్నపైనే కేసులు నమోదు. అంటే ఇక్కడ బాధితుడే బాధ్యుడన్నట్లు చిత్రీకరణ. ఇది పైశాచికత్వం కాదా? ఒక దుష్ట సంప్రదాయం తీసుకొచ్చాడు చంద్రబాబు.జగన్‌ ప్రెస్‌మీట్‌ హైలైట్స్‌అన్నింటికీ ఒకటే మోడస్‌ ఆపరెండి:ఒక్క కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయమే కాదు.. ప్రసన్న అన్న విషయమే కాదు.. కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి సహా ఎంతో మంది మీద తప్పుడు కేసులు పెట్టారు. వీళ్లే కాక 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుతో సహా, కృష్ణమోహన్‌ రెడ్డి, ధనుంజయరెడ్డి.. లాంటి తమ జీవితంలో మచ్చ లేని రిటైర్డ్‌ అధికారులు వీరు. వీరు కాక ఇంకా ఎంతో మంది అమాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. అన్ని కేసులకు ఒకటే మోడస్‌ ఆపరాండి. తప్పుడు వాంగ్మూలంతో తమ టార్గెట్‌లో ఉన్న వారిపై కేసులు. అరెస్టులు.అప్పుడు వారి పరిస్థితి ఏమిటి?:ఇదే సంప్రదాయాన్ని రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఇప్పుడు దెబ్బ తిన్న వారు ఇలాగే వ్యవహరిస్తే, మీ పరిస్థితి ఏమిటి?. చంద్రబాబుగారు వేసిన విత్తనం రేపు వృక్షమై పోతుంది. రేపు ఇదే కొనసాగితే.. చంద్రబాబు, టీడీపీ వారి పరిస్థితి ఏమిటి? ఈరోజు దెబ్బ తిన్న వారు ఊర్కోరు కదా?. ఈరోజు మీరు చేసే తప్పుడు సంప్రదాయం, రేపు విషవృక్షం అవుతుంది. ఈరోజు దెబ్బ తిన్నవారు, మేము చెప్పినా వినకపోవచ్చు. కాబట్టి చంద్రబాబుగారు ఇకనైనా పద్ధతి మార్చుకో. తప్పుడు సంప్రదాయం వదిలెయ్‌.ఏదీ లేదు. అయినా ఎవరూ మాట్లాడొద్దు:ఇవన్నీ చంద్రబాబు ఎందుకు చేస్తున్నాడో అందరికీ తెలుసు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ లేదు. మ్యానిఫెస్టో హామీల అమలు లేదు. రైతు భరోసా లేదు. తల్లికి వందనం లేదు. వాటి గురించి ఎవరూ మాట్లాడొద్దు. గత ఏడాది ఒక సిలిండర్‌ కొందరికే ఇచ్చారు. ఈ ఏడాది కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. తల్లికి వందనం లేదు. నిరుద్యోగ భృతి ఏడాదికి రూ.36 వేలు. దీన్ని మొత్తం ఎగ్గొట్టారు.దీన్ని ఎవరూ ప్రశ్నించొద్దు. అడగొద్దు. 50 ఏళ్లకే పెన్షన్‌ అని దాన్ని ఎగ్గొట్టారు. ఫ్రీ బస్‌ లేదు. ఏడాది గడిచిపోయింది. పండగల మీద పండగల డేట్లు చెబుతున్నాడు. కానీ, అమలు మాత్రం లేదు.పిల్లలు చదువులు మాని, పనులకు పోతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇప్పటికి 6 క్వార్టర్లు పెండింగ్‌. అలా రూ.4,200 కోట్లు బకాయిలు. వసతి దీవెన కింద ఏటా ఏప్రిల్‌లో రూ.1100 కోట్లు ఇవ్వాలి. రెండేళ్లు గడిచాయి కాబట్టి, రూ.2200 కోట్లు. రెండూ కలిపి రూ.6,600 కోట్లు కావాలి కానీ, ఇచ్చింది మాత్రం రూ.770 కోట్లు. అయినా ఎవరూ మాట్లాడొద్దు. ఆరోగ్యశ్రీ కింద ఏటా రూ.3600 కోట్లు చొప్పున బకాయి. ఆరోగశ్రీ, ఆరోగ్య ఆసరా కింద రూ.4500 కోట్లు బకాయి.చంద్రబాబు తొలగించిన ఉద్యోగాలు 3 లక్షలకు పైగా. 2.6 లక్షల మంది వలంటీర్లు. ఎండీయూ వాహనాల ద్వారా 20 మంది ఉపాధి కోల్పోయారు. ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్‌. అధికారంలోకి వస్తే జీపీఎస్‌ రద్దు చేసి, ఓపీఎస్‌ తెస్తామన్నారు. అదీ మోసం. ఉద్యోగుల బకాయిలు రూ.20 వేల కోట్లు దాటాయి. అడిగితే తోకలు కట్‌. అక్రమ కేసులు. చివరకు గ్రామ, వార్డు సచివాలయాలు నిర్వీర్యం. ధాన్యం కొనుగోళ్ల బకాయిలు ఏప్రిల్‌ నుంచి దాదాపు రూ.1000 కోట్లు బకాయి.అప్పుల కుప్ప. దా ‘రుణ’ స్థితి:చంద్రబాబు 14 నెలల్లోనే తెచ్చిన అప్పులు 1,75,112 కోట్లు. కానీ, ఒక్క పథకం అమలు లేదు. 5 ఏళ్లలో మా ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు. అప్పుడు రెండేళ్లు కరోనా ఉంది. అయినా అన్ని పథకాలు ఇచ్చాం. అంటే మా 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో 52.34 శాతం 14 నెలల్లోనే చేశాడు. మరి ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోయింది? ఎవరికి మంచి చేయలేదు. పథకాల అమలు లేదు. అయినా ఎవరూ అడగొద్దు. రూ.18,272 కోట్ల బాదుడు విద్యుత్‌ ఛార్జీల రూపంలో భారం వేశారు. ఫ్యుయెల్‌ అండ్‌ పవర్‌ పర్చేజ్‌ కాస్ట్‌ అడ్జస్ట్‌మెంట్‌ (ఎఫ్‌పీపీసీఏ) పేరుతో దోపిడి. చంద్రబాబు పుణ్యమా అని అమూల్‌ నష్టపోతోంది. మరోవైపు హెరిటేజ్‌ లాభాల్లో ఉంది. పాల ధరలు పెరిగాయి. పిల్లల ఫీజులు పెరిగాయి. నాడు–నేడు పనులు నిల్చిపోయాయి. అయినా ఎవరూ మాట్లాడొద్దు.ఎవ్వరూ ప్రశ్నించొద్దు:కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ, పోర్టులు, ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల అమ్మకం, మట్టి మాఫియా, ఇసుక స్కామ్‌.. దేని గురించి ఎవరూ మాట్లాడొద్దు. ఇక్కడ నిర్మాణ వ్యయం పెంచారు. ప్రతి అడుగుకు దాదాపు రూ.10 వేలు చెల్లింపు. 10 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ ఇచ్చి, 8 శాతం కమిషన్‌ తీసుకుంటున్నారు. ఊరూ పేరు లేని కంపెనీలకు భూములు ఇస్తున్నారు. అయినా ఎవరూ మాట్లాడొద్దు. ప్రశ్నించొద్దు. ఎక్కువ ధరకు పీపీఏ చేసుకున్నా అడగొద్దు. ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగాయి. అయినా ఎవరూ ప్రశ్నించొద్దు.జగన్‌ ప్రెస్‌మీట్‌ హైలైట్స్‌వడ్డీతో సహా చెల్లిస్తాం:ఒకటే చెబుతున్నా. ప్రజలతో ఉంటాం. వారి కోసం పోరాడుతాం. కేసులకు భయపడం. చంద్రబాబుకు, ఆయనకు వత్తాసు పలుకుతున్న వారికి ఒకే హెచ్చరిక. ఎవరినీ వదలం. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం. మరో మూడేళ్లు గడిస్తే, మా ప్రభుత్వం వస్తుంది.కరేడు రైతుల సమస్యపై మీడియా ప్రశ్నకు సమాధానంగా.. ఇండోసోల్‌ను తరిమేసే కుట్ర:ప్రకాశం జిల్లాలో ఇండోసోల్‌కు భూమి ఇచ్చాం. వారు రైతులకు డబ్బులిచ్చారు. 8 వేల ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. కానీ, వారిని వెళ్లిపొమ్మంటున్నారు. ఆ భూములు వేరే వారికి ఇచ్చేలా, ఇండోసోల్‌ కంపెనీని కరేడుకు పొమ్మంటున్నారు. అక్కడ రైతులు రెండు పంటలు పండే భూములు ఇవ్వబోమంటున్నారు. ఆ కంపెనీ రూ.42 వేల కోట్లు పెట్టుబడి. మరి మీరు కంపెనీలు రావాలనుకుంటున్నారా?. అదే బీపీసీఎల్‌కు ల్యాండ్‌ ఇవ్వాలనుకుంటే, ప్రకాశం జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని ఇవ్వొచ్చు కదా? వారికి ఇండోసోల్‌ కంపెనీ ల్యాండ్‌ ఇవ్వాల్సిన అవసరం ఏముంది?అదే చంద్రబాబు లక్ష్యం:పరిశ్రమల ఏర్పాటు కాదు చంద్రబాబు లక్ష్యం. వారిని బెదిరించి సొమ్ము చేసుకోవడం. జిందాల్‌ వాళ్లు వెళ్లిపోయారు. అరబిందో వాళ్లు దండం పెడుతున్నారు అని జగన్‌ మీడియా సమావేశం ముగించారు.

YS Jagan Serious Comments On police Cases In AP2
దెబ్బ తిన్న వాళ్లు రేపు నా మాట కూడా వినరు: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో ఏం జరుగుతోంది అన్నది అందరూ చూస్తున్నారు.. చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు. బీహార్‌లో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యేలపై దాడులు చేయడమేంటి?. ప్రజా ప్రతినిధులకు పోలీసులు గన్‌ చూపించి బెదిరిస్తారా? అని ఆగ్రహం​ వ్యక్తం చేశారు.వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తాడిపత్రిలో ఓ మాజీ ఎమ్మెల్యే (కేతిరెడ్డి పెద్దారెడ్డి) తన సొంత ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఉంది. హైకోర్టు ఆదేశాలున్నా.. పోలీసులు అడ్డుతగులుతున్న పరిస్థితి కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యేకు పోలీసులు.. గన్‌ చూపించమేంటి?. మనం ఎక్కడ ఉన్నాం. ఆరు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై పచ్చ సైకోలు.. అదీ పోలీసుల సమక్షంలోనే దాడికి ప్రయత్నించారు. పోలీసులు అక్కడే ఉన్నా.. పచ్చ బ్యాచ్‌ను అడ్డుకోలేదు. ఆటవిక రాజ్యంలో ఉన్నామా?. చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి.బాధితుడు నల్లపురెడ్డి మీదనే కేసు పెట్టారు. ఇది శాడిజం కాదా?. కాకాణి, వంశీ, మిథున్‌ రెడ్డి, చెవిరెడ్డి, నందిగం సురేష్‌, పిన్నెల్లి, పోసాని సహా ఎంతో మందిపై తప్పుడు కేసులు పెట్టారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాస్‌పై కూడా కేసు పెట్టారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి మచ్చ లేని అధికారులు. వారి మీద కూడా అక్రమ కేసులు పెట్టారు. ఎంతో మంది అమాయకులపైనా తప్పుడు కేసులు బనాయించారు. తప్పుడు వాంగ్మూలతో ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు రాజకీయాల్లో దుష్ట సంప్రదాయం తెచ్చారు. మా ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు పరిస్థితి ఏంటి?. చంద్రబాబు నీ తప్పుడు సంప్రదాయం విష వృక్షం అవుతుంది. మా ప్రభుత్వం వచ్చాక ప్రతి చర్యగా వీళ్లు కూడా ఇదే చేస్తే పరిస్థితి ఏంటి?. చంద్రబాబు ఇప్పటికైనా మారకపోతే వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉండదు. దెబ్బ తగిలిన వాడికే బాధ తెలుస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక మా వాళ్లు నా మాట కూడా వినరు. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు. మా ప్రభుత్వం వచ్చాక వడ్డీ సహా చెల్లిస్తాం.’ అంటూ హెచ్చరించారు.

Fifties from Dunkley, Davidson-Richardson guide England to 258 in 50 overs3
రాణించిన ఇంగ్లండ్ బ్యాట‌ర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

సౌతాంప్టన్ వేదిక‌గా భార‌త మ‌హిళ‌ల‌తో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో ఇంగ్లండ్ బ్యాట‌ర్లు రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ అమ్మాయిల జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 258 ప‌రుగులు చేసింది. ఇంగ్లండ్‌కు ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారీ షాక్ త‌గిలింది.ఓపెన‌ర్లు టామీ బ్యూమాంట్(5), అమీ జోన్స్‌(1)ను బారత పేస‌ర్‌ క్రాంతి గౌడ్ పెవిలియ‌న్ పంపింది. ఈ క్ర‌మంలో కెప్టెన్ స్కివ‌ర్ బ్రంట్‌(41), లాంబ్‌(39) ఇన్నింగ్స్‌ను చ‌క్కదిద్దారు. వీరిద్ద‌రూ ఔట‌య్యాక సోఫీ డంక్లీ(83), ఆలిస్ డేవిడ్సన్ రిచర్డ్స్(53) జ‌ట్టు స్కోర్ బోర్డును న‌డిపించారు.వీరిద్ద‌రూ ఐదో వికెట్‌కు 106 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. భార‌త బౌల‌ర్ల‌లో క్రాంతి గౌడ్‌, స్నేహ్ రాణా త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. చ‌రణి, అమ‌న్‌జ్యోత్ కౌర్ త‌లా వికెట్ సాధించారు. స్టార్ ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ ఒక్క వికెట్ కూడా సాధించ‌లేక‌పోయింది.తుది జట్లుఇంగ్లండ్: టామీ బ్యూమాంట్, అమీ జోన్స్ (వికెట్ కీపర్‌), ఎమ్మా లాంబ్, నాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్‌), సోఫియా డంక్లీ, ఆలిస్ డేవిడ్సన్ రిచర్డ్స్, షార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్, లారెన్ ఫైలర్, లారెన్ బెల్భారత్‌: ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్‌), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, స్నేహ రాణా, శ్రీ చరణి, క్రాంతి గౌడ్

Devendra Fadnavis offer to Uddhav Thackeray4
ఉద్దవ్‌ ఠాక్రేకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ బంపరాఫర్‌!

ముంబై: ‘రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు’ అనేది నానుడి. ఇది భవిష్యత్‌ మహా రాజకీయాల్లో నిరూపితం కానుంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌.. ప్రతిపక్షనేత ఉద్ధవ ఠాక్రేకు బంపరాఫ్‌ ఇచ్చారు. మళ్లీ తమతో కలిసిపోవచ్చంటూ ఆహ్వానించారు. దీంతో పాత మిత్రులు మళ్లీ ఒక్కటి కానున్నారా? అన్న ప్రచారం జోరందుకుంది. బుధవారం మహారాష్ట్ర శాసన మండలిలో జరిగిన అంబదాస్ డాన్వే (ఉద్ధవ్ ఠాక్రే శివసేన విభాగానికి చెందిన ప్రతిపక్ష నేత) వీడ్కోలు సభలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఉద్ధవ్ జీ 2029 వరకు మాది అధికార పక్షమే. కానీ మీరు మా వైపు రావాలనుకుంటే ఆలోచించుకోండి. అది మీపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఫడ్నవీస్‌ చేసిన ఈ వ్యాఖ్యలు సభలోని సభ్యుల మొహాల్లో నవ్వులు పూయించేలా చేశాయి. కానీ రాజకీయంగా దీని వెనుక ఉన్న వేరే ఉద్దేశ్యం ఉందన్న చర్చలు మొదలయ్యాయి. ఫడ్నవ్‌ ఆహ్వానంపై ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. ఫడ్నవీస్‌ ఆహ్వానం సరదాగా చెప్పిన మాట. అంతే’ అని అన్నారుకాగా, గత ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ,ఏకనాథ్ షిండే నేతృత్వంలో శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలు పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. ఉద్ధవ్ ఠాక్రే గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, 2022లో విభజన తర్వాత ఆయన శివసేన (UBT) నేతగా కొనసాగుతున్నారు.ఈ క్రమంలో సీఎం ఫడ్నవీస్‌ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీసింది. ఫడ్నవీస్‌ చేసిన ఈ రాజకీయ పరమైన కామెంట్లు భవిష్యత్తులో పాత మిత్రులు మళ్లీ కలవవచ్చన్న సంకేతాలు పంపినట్లైంది. పాత మిత్రుల మధ్య మళ్లీ పొత్తు పొడిస్తే మహా రాజకీయాలు మలుపులు తిరగనున్నాయి. అయితే… ఇదంతా ఊహలు మాత్రమే. నిజంగా పొత్తు ఉంటుందా? ఉండదా? అనేది భవిష్యత్తులో తేలాల్సి ఉంది. देवेंद्र फडणवीस ने कहा - उद्धव जी, 2029 तक कोई स्कोप नहीं है! #MaharashtraCM #DevendraFadnavis #mansoonsession2025 #AssemblySession #UddhavThackeray #SSUBT pic.twitter.com/62dLFKNXiQ— Aaj Ke Devendra Kal Ke Narendra (@AajKDKalN) July 16, 2025

Iran Supreme Leader Ayatollah Ali Khamenei Comments On America Israel5
ఇజ్రాయెల్‌ ఓ క్యాన్సర్ కణితి: ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ

అమెరికా, ఇజ్రాయెల్‌లపై ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ నేరాల్లో అమెరికా భాగస్వామి అంటూ విరుచుకుపడ్డారు. టెల్‌ అవీవ్‌ను క్యాన్సర్‌ కణితిగా ఆయన అభివర్ణించారు. వాషింగ్టన్‌ చెప్పినట్లు నడుచుకుంటుందంటూ మండిపడ్డారు. కాగా, ఇజ్రాయెల్‌తో యుద్ధం తర్వాత అయతుల్లా అలీ ఖమేనీ ఎట్టకేలకు బయటకు రాగా.. జూలై 5న టెహ్రాన్‌లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో తొలిసారిగా కనిపించారు. ఇరాన్-ఇజ్రాయెల్‌లలో 12 రోజుల పాటు జరిగిన వైమానిక దాడుల కారణంగా ఖమేనీ సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం జరిగి.. మరోవైపు అమెరికాతో అణు చర్చలు జరపనున్న వేళ సుప్రీం లీడర్‌ తీవ్ర స్థాయిలో స్పందించడం సంచలనం రేపుతోంది. అమెరికా, ఇజ్రాయెలతో గొప్పగా పోరాటం చేశామన్న ఖమేనీ.. మళ్లీ ఎలాంటి దాడులు జరిగినా దీటుగా బదులిచేందుకు ఇరాన్‌ సిద్ధంగా ఉందంటూ హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఇటీవల 12 రోజుల యుద్ధాన్ని ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రారంభించింది.. కానీ విఫలమైంది’’ అంటూ ఖమేనీ తీవ్ర ఆరోపణలు చేశారు.12 రోజుల పాటు జరిగిన తీవ్ర యుద్ధంలో జోక్యం చేసుకున్న అమెరికా.. ఇరాన్‌లో అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిపింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో వందల మంది మరణించారు. ఇజ్రాయెల్ తన వైమానిక దాడులతో ఇరాన్‌లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ ప్రతిగా మిస్సైల్ దాడులు చేసి, అమెరికా స్థావరాలపై కూడా దాడి చేసింది.

Ktr Tweet On Cm Revanth Reddy6
రేవంత్‌ గుట్టు రట్టయ్యింది: కేటీఆర్‌ ట్వీట్‌

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందన్న కేటీఆర్‌.. ముసుగు వీడింది.. నిజం తేటతెల్లమయ్యిందన్నారు. ‘‘నిధులు రాహుల్‌ గాంధీకి.. నీళ్లు చంద్రబాబుకి.. బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయిస్తున్నారు. గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పజెప్పడానికేనా?. నువ్వు గద్దెనెక్కింది’’ అంటూ ఎక్స్‌ వేదికగా రేవంత్‌పై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘కోవర్టులెవరో, తెలంగాణ కోసం కొట్లాడిందెవరో తేలిపోయింది. ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా పోరాటం తప్పదు. తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పని పడతాం’’ అంటూ కేటీఆర్‌ హెచ్చరించారు. నీ గురువుపై విశ్వాసం చూపించడానికి తెలంగాణ విధ్వంసం కావలసిందేనా?. ఇంకెందుకు రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు?. నిన్ను ఎన్నుకున్న పాపానికి…చెరిపేయి సరిహద్దులు! తెలంగాణా మీద నీ అక్కసు చల్లారుతుందేమో!’’ అంటూ కేటీఆర్‌ పోస్ట్‌ చేశారు.ముసుగు వీడింది, నిజం తేటతెల్లమయ్యింది! 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందినిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి, తెలంగాణా వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు….బూడిద తెలంగాణ ప్రజలకి! బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి….గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం…— KTR (@KTRBRS) July 16, 2025

Annabelle Doll handler Dan Rivera News Interesting Case Details7
ప్రాణం తీసిన అన్నాబెల్లె బొమ్మ!?

అన్నాబెల్లె.. ది కంజూరింగ్‌ సిరీస్‌ సినిమాలు చూసిన వాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు. అయితే సినిమాటిక్‌ ప్రపంచంలో ఈ బొమ్మ ఎలా ఉన్నా.. వాస్తవ ప్రపంచంలో మాత్రం దీని రూపురేఖలు మరోలా ఉంటాయి. అయితే ఈ బొమ్మతో స్టంట్‌లు చేయబోయి ఓ పారానార్మల్‌ ఇన్వెస్టిగేటర్‌ అనూహ్యంగా ప్రాణం పొగొట్టుకున్నారు.అమెరికాలో కనెక్టికట్‌ స్టేట్‌లోని న్యూఇంగ్లండ్‌ సొసైటీ ఫర్‌ సైకిక్‌ రీసెర్చ్‌(NESPR) వాళ్లు.. డెవిల్స్‌ ఆన్‌ ది రన్‌ పేరుతో టూర్లు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో భయానక వస్తువులుగా ముద్రపడినవాటి గురించి వివరించడం ఈ షో ఉద్దేశం. ఇందులో భాగంగా.. అన్నాబెల్లె ఒరిజినల్‌ బొమ్మతో డాన్‌ రివెరా(54) అనే పారానార్మల్‌ ఇన్వెస్టిగేటర్‌ స్టంట్లు చేస్తున్నాడు. అయితే అనూహ్యంగా ఈ పర్యటనలోనే ఆయన కన్నుమూశారు.పెన్సిల్వేనియా గెట్టిస్‌బర్గ్‌ సమీపంలో.. జులై 13న తాను బస చేసిన హోటల్‌ గదిలో విగత జీవిగా ఆయన పడి కనిపించాడు. సీపీఆర్‌ చేసినా ఆయనలో చలనం లేదు. మృతికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. బహుశా గుండెపోటుతో ఆయన మరణించి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. అయితే.. ఆయన చనిపోయిన టైంలో ఆ బొమ్మ హోటల్‌ గదిలో లేదు. బయట తాళం వేసి ఉన్న ఓ వ్యాన్‌లో బొమ్మ కనిపించింది. దానిని ఎవరు అక్కడ ఉంచారనేది తేలాల్సి ఉంది. దీంతో బొమ్మను ఆయన చావుకు ముడిపెట్టి చర్చ నడిపిస్తున్నారు. డాన్‌ రివెరా(dan Rivera) మృతిపై ఇప్పటికైతే అనుమానాలు నెలకొన్నాయి. అటాప్సీ(శవపరీక్ష) నివేదిక వస్తేనే ఈ మృతి మిస్టరీ వీడేది. ఎన్‌ఈఎస్‌పీఆర్‌ అనే సంస్థను ప్రముఖ డీమనాలజిస్టులు(దెయ్యాలు, భూతాలు, ఆత్మలపై పరిశోధనలు చేసేవారు), పారానార్మల్‌ ఇన్వెస్టిగేటర్లు ఎడ్‌, లారాయిన్‌ వారెన్‌లు స్థాపించారు. డాన్‌ రివెరా.. గతంలో అమెరికా సైన్యంలో పని చేశారు. ఎన్‌ఈఎస్‌పీఆర్‌తో చాలాకాలంగా ఆయనను అనుబంధం ఉంది. లారాయిన్‌ వారెన్‌కు ముఖ్యశిష్యుడు కూడా. అంతేకాదు.. గతంలో ఓ చానెల్‌లో మోస్ట్‌ హంటెడ్‌ ప్లేసెస్‌ అనే కార్యక్రమంలోనూ ఈయన పాల్గొన్నారు. అదే సమయంలో నెట్‌ఫ్లిక్స్‌ ‘28 డేస్‌ హాంటెడ్‌’ అనే సిరీస్‌లోనూ కనిపించారు. చాలాకాలంగా అన్నాబెల్లె బొమ్మను ఈయనే చూసుకుంటున్నారు. టిక్‌టాక్‌లో ఆ బొమ్మ షార్ట్‌ వీడియోస్‌ కూడా విశేషంగా ఆదరణ దక్కించుకున్నాయి. ఈ విషాదంపై ఎన్‌ఈఎస్‌పీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే డెవిల్స్‌ ఆన్‌ ది రన్‌ మాత్రం ఆగదని స్పష్టం చేసింది. పైగా ఈ బొమ్మతో ఇప్పటిదాకా ప్రాణాలు పోయిన దాఖలాలు లేవని చెబుతున్నారు.కొన్నాళ్ల కిందట లూసియానా టూర్‌లో అన్నాబెల్లె బొమ్మ కనిపించకుండా పోయిందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే వాటిని రివెర కొట్టిపారేశారు. బొమ్మ సురక్షితంగానే ఉందని ప్రకటించారు. అసలు అన్నాబెల్లే బొమ్మ The Conjuring సినిమాల్లో చూపించిన పోర్సలిన్ బొమ్మ కాదు. నిజ జీవితంలో ఇది రాగ్గెడీ అన్న్ అనే క్లాత్ డాల్, ఎర్ర రంగు నూలతో చేసిన జుట్టుతో ఉంటుంది. కానీ, దీని వెనుక ఉన్న కథ చాలా భయానకంగా ఉంటుంది. 1970లో.. ఈ బొమ్మను లారా క్లిఫ్టన్, డియర్డ్రె బెర్నార్డ్ అనే ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులకు బహుమతిగా ఇచ్చారు. మొదట ఇది సాధారణ బొమ్మలా అనిపించినా, కొద్దిరోజుల్లో దానంతట అదే కదలడం మొదలైందట. దీంతో వాళ్లు ఓ నిపుణుడ్ని సంప్రదించగా, ఈ బొమ్మలో అన్నాబెల్లే హిగ్గిన్స్ అనే చిన్న అమ్మాయి ఆత్మ ఉందని చెప్పారు. పైగా HELP US, HELP CAL అనే రాతలతో ఉన్న పేపర్లు ఆ ఇంట్లో ప్రత్యక్షమయ్యాయి. పెన్సిల్‌ కూడా లేని ఇంట్లో అవి కనిపించడంతో అంతా భయపడిపోయారు. ఆ సమయంలోనే.. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు వారెన్ దంపతుల వద్దకు బొమ్మ చేరింది. వాళ్లు దానిని తమ ఇంటి బేస్‌మెంట్‌లోని కలెక్షన్‌లో దాచారు. అదే తర్వాత వారెన్ ఆకల్ట్ మ్యూజియంWarren Occult Museumగా మారింది. ఈ మ్యూజియంలో శిలువ(Cross), పవిత్ర నీరు(Holy Water)తో అన్నాబెల్లె బొమ్మను ఓ గ్లాస్ కేస్ లో బంధించారు. అక్కడ “Touch not!” అనే హెచ్చరిక కూడా ఉంది. మరికొన్ని కలెక్షన్లు కూడా అక్కడ ఉన్నాయి. మ్యూజియం అమెరికాలోని కనెక్టికట్‌ స్టేట్‌లోని మోన్రో నగరంలో ఉంది. అయితే.. 2019లో Lorraine Warren మరణం తర్వాత మ్యూజియం శాశ్వతంగా మూసివేయబడింది. మ్యూజియం Tony Spera (వారెన్‌ల అల్లుడు) ఆధ్వర్యంలో ఉంది. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో లేదు, కానీ NESPR పారానార్మల్ ఈవెంట్స్‌లో కొన్ని వస్తువులను ప్రదర్శిస్తోంది. అందులో ది ఫేమస్‌ హాంటెడ్‌ డాల్‌గా పేరున్న అన్నాబెల్లె కూడా ఉంది. వారెన్‌ దంపతుల ఇన్వెస్టిగేషన్ల స్ఫూర్తితోనే కంజూరింగ్‌ సినిమాలు తెరకెక్కాయి.Annabelle Handler Dan Rivera Dies Suddenly During Haunted Tour, RIP #annabelle #annabelledoll #edwarren #lorrainewarren #paranormal #riristea #rivetsoro pic.twitter.com/6Ya3WM6K03— Rivet Soro (@Rivet_Soro) July 15, 2025

Allegations against Samir Kumar Sahu in Balasore Tragedy8
‘నువ్వు చిన్న పిల్లవి కాదు.. నన్ను అర్థం చేసుకో’.. బీఈడీ విద్యార్థినితో లెక్చరర్‌

భువనేశ్వర్‌: లెక్చరర్‌ వేధింపుల కారణంగా ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌ విద్యార్థిని మృతి ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థిని వేధించిన ఇంటిగ్రేటెడ్ బీఈడీ విభాగ అధిపతి, లెక్చరర్‌ సమీర్‌ రంజన్‌ సాహూపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థిని ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్న ఫకీర్‌ మోహన్‌ కాలేజీ అంతర్గత ఫిర్యాదు కమిటీ (ఐసీసీ) సభ్యులు లెక్చరర్‌ సమీర్‌ రంజన్‌ సాహూను విధుల నుంచి తొలగించాలని యాజమాన్యానికి సిఫార్స్‌ చేసింది. కాలేజీ విద్యార్థుల నుంచి లెక్చరర్‌ సాహుపై వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ సమన్వయ కర్త జయశ్రీ మిశ్రా వెల్లడించారు. అయినప్పటికీ, యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్యానల్‌ సభ్యులు సైతం ఇప్పటికే విద్యార్థినుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, క్లాసులు చెప్పే విధానం మార్చుకోవాలని లెక్చరర్‌ సాహూకు సూచించింది. ఈ సందర్భంగా విద్యార్థినుల పట్ల లెక్చరర్‌ సాహూ ఒడిగట్టిన ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అంతర్గత ఫిర్యాదు కమిటీ (ఐసీసీ) సభ్యురాలు మినాటీ సేథీ లెక్చరర్‌పై ఆరోపణలు చేశారు. క్లాసు జరిగే సమయంలో విద్యార్థినులు ఏ చిన్న తప్పు చేసినా తరగతి గది బయట నిలబెట్టేవారు. అలా లైగింక వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బాధిత విద్యార్థినిని కూడా అలాగే క్లాసు బయట నిలబెట్టారు. ఇదే విషయంపై లెక్చరర్ తీరును ప్రశ్నిస్తూ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుతో జూన్‌ 30న కాలేజీలో జరిగిన సెమిస్టర్‌ పరీక్షలను విద్యార్థినిని రాయనీవ్వలేదు. దీంతో ఆమె బాగా కృంగిపోయింది. ఎప్పుడైతే లెక్చరర్‌పై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసిందో.. ఆ మరుసటి రోజు నుంచి విద్యార్థిని మానసికంగా, లైంగిక వేధింపులు గురైంది.దుర్ఘటనకు ముందు లెక్చరర్‌ సాహూకు.. మృతి చెందిన విద్యార్థిని మధ్య సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో సాహూ తనకు ఫేవర్‌ చేయమని నన్ను అడిగారు. అందుకు నేను .. మీకు ఏ విధమైన ఫేవర్‌ కావాలని అడిగాను. అలా నేను అడిగినప్పుడు నాకు ఎలాంటి ఫేవర్‌ కావాలో అర్ధం చేసుకోలేనంత చిన్నపిల్లవి కావు నువ్వు’ అని నన్ను అన్నారంటూ ప్యానల్‌కు ఫిర్యాదు చేసింది’అని సేథి అన్నారు.ఐసీసీ సభ్యులపై విద్యార్థిని తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. నా కుమార్తె మరణానికి ఐసీసీ సభ్యులే బాధ్యులు. నా కుమార్తె మరణంపై పక్షపాతంగా నివేదిక తయారు చేశారని అన్నారు. జులై 12న ఒడిశాలోని బాలాసోర్‌ ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలకు చెందిన 20 ఏళ్ల బీఈడీ విద్యార్థిని ఆత్మహత్య ఆ రాష్ట్రాన్ని కలచివేసింది. కాలేజీలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ విభాగ అధిపతి, లెక్చరర్‌ సమీర్‌ రంజన్‌ సాహూ తనని మానసికంగా,లైంగికంగా వేధిస్తున్నారంటూ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తనని తాను నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యాయత్నంతో 95 శాతం కాలిన గాయాలైన విద్యార్థిని తోటి విద్యార్థులు ఎయిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ జూలై 14 రాత్రి మరణించారు. కాగా, విద్యార్థిని ఫిర్యాదు చేసిన సమీర్ కుమార్ సాహూపై కళాశాల అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) అతనికి క్లీన్ చిట్ ఇవ్వడంపై దుమారం చెలరేగింది.

Chandrababu Following Ys Jagan In Implementing Welfare Schemes9
బాబైనా.. ట్రెండ్‌ సెట్టర్లను అనుసరించాల్సిందే!

ఫాలో ద లీడర్‌ అంటూ ఉంటారు చూడండి అదిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది. పదవిలో ఎంత కాలం ఉన్నామన్నది కాదు.. ఉన్నది కొద్దికాలమైనా ఆ పదవిలోకి వచ్చే ఇతరులకు ఎంత ఆదర్శంగా నిలిచామన్నది ముఖ్యమంటారు. ఈ విషయాన్ని ఆంధప్రదేశ్‌ రాజకీయాలిప్పుడు రుజువు చేస్తున్నాయి. ప్రత్యేకించి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో ఆయన హయాంలో తీసుకొచ్చిన పాలన సంస్కరణలు, మార్పులు, స్కీములు, ప్రాజెక్టులను ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించారు.విభజిత ఏపీలో 2019-2024 టర్మ్‌లో సీఎంగా ఉన్న వైఎస్ జగన్ సృష్టించిన వ్యవస్థలు, తెచ్చిన పథకాలను ప్రస్తుత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అమలు చేయక తప్పడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తరువాత కూడా సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు తాను కూడా జగన్ తెచ్చిన వ్యవస్థలను కొనసాగిస్తానని, స్కీములను అమలు చేస్తామని, అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పేవారు. ఇది ఒక రకంగా నాయకుడిని అనుసరించడమే!కూటమి సర్కారు కూడా కొన్నింటిని మినహాయించి మిగిలిన వాటి విషయంలో జగన్‌ విధానాలనే అనుసరిస్తోంది. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే కడప నగరంలో వెలిసిన ఒక ఫ్లెక్సీ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందడం వల్ల! అది అత్యంత ఆసక్తికరంగా ఉంది. జగన్‌కు ప్రజలలో వస్తున్న ఆదరణను గమనించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతడిని ఎలా అనుసరిస్తున్నాడో వివరించారీ ఫ్లెక్సీలో! ఫ్లెక్సీలోని కొన్నింటి గురించి చూద్దాం..‘‘సంక్షేమం అంటే అంత ఇష్టం ఉండని ఆయనకు సంక్షేమం అంటే నేర్పించావు" అని ఒక కామెంట్‌ ఉంది దాంట్లో. నిజంగానే సంక్షేమ రంగంపై చంద్రబాబుది భిన్నాభిప్రాయం. ఇదే విషయాన్ని ఆయన చాలాసార్లు బహిరంగంగానే చెప్పుకున్నారు కూడా. ఎన్నికల సమయంలో మాత్రం జగన్‌ ఇచ్చేదానికంటే రెండు మూడు రెట్లు ఎక్కువే ఇస్తానని హామీ ఇచ్చినా, జగన్ ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చి మేనిఫెస్టోల్లో ఊదరగొట్టినా... గెలిచిన తరువాత మాత్రం సంపద సృష్టించే సంక్షేమం అమలు చేయాలని, సంక్షేమంతోనే అన్నీ జరిగిపోవని మాట్లాడిన విషయం ప్రజల దృష్టిలోనే ఉంది.పెన్షన్‌ ఒక వెయ్యి రూపాయలు పెంచడం మినహా ఏడాది పాటు మిగిలిన అన్ని పథకాలనూ కూటమి సర్కారు ఎగవేసింది. ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామన్న ఎన్నికల హామీ గెలుపు తరువాత ఒక్క సిలిండర్‌కే పరిమితమైంది. ప్రజల్లో వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతను గుర్తించి ఏడాది తరువాత తల్లికి వందనం స్కీమును కొంత అమలు చేయక తప్పలేదు. అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటి వాటిని అమలు చేస్తామని ప్రకటించారు. మొత్తమ్మీద జగన్ కారణంగా చంద్రబాబు సంక్షేమ రంగం వైపు చూడక తప్పలేదని చెప్పాలి.'ఎప్పుడూ లేనిది గెలిచిన వెంటనే కోడితో పోటీగా నిద్రలేచి పొద్దు, పొద్దునే బ్యాగు తగిలించుకుని అవ్వ,తాతలకు ఫించన్ డబ్బులు ఇచ్చేటట్లు చేశావు" అన్నది కడపలో వెలిసిన ఫ్లెక్సీలోని మరో వ్యాఖ్య. ఇది కూడా వాస్తవమే. 14 ఏళ్లు సీఎంగా ఉండగా ఏ రోజూ చంద్రబాబు ప్రతి నెల ఉదయాన్నే వెళ్లి ఫించన్లు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. వృద్ధులే నానా తిప్పలూ పడాల్సి వచ్చేది. రెవెన్యూ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చేది. జగన్‌ వలంటీర్ల వ్యవస్థ ద్వారా పింఛన్లను ఇళ్ల వద్దకే చేర్చేశారు. అధికారంలోకి వస్తే తానూ వలంటీర్లను కొనసాగిస్తానని ఉగాది నాడు దైవపూజ చేసి మరీ చెప్పిన చంద్రబాబు ఆ తరువాత దానికి మంగళం పాడారు. కాని జగన్ పెట్టిన పద్దతి మాత్రం పాటించక తప్పలేదు. ఆయన స్వయంగా కొందరు వృద్ధుల వద్దకు వెళ్లి ఫించన్‌ అందచేస్తున్నారు. ఇందుకు అనవసరంగా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారనుకోండి. అది వేరే విషయం.నాడు-నేడు కార్యక్రమం ద్వారా బాగు చేసిన బడులకు వెళ్లి, ప్రభుత్వ స్కూళ్ల గురించి చంద్రబాబు మాట్లాడేలా చేశారన్నది మరో కామెంట్. నిజమే. విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదని ఎంతో ఘనంగా చెప్పిన ఘనత చంద్రబాబుది మరి. అలాంటి వ్యక్తి ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులను స్వయంగా గమనించారు. ఆ క్రమంలో అక్కడ ఒక చోట రాసి ఉన్న నాడు-నేడు పదాలను చెరపడానికి స్కూల్ సిబ్బంది నానా పాట్లు పడాల్సి రావడం విశేషం. ఇష్టం ఉన్నా, లేకపోయినా, తండ్రి, కొడుకులు కుటుంబంలోని పిల్లలందరికి తల్లికి వందనం డబ్బులు ఇవ్వక తప్పలేదని అది కూడా జగన్ ఎఫెక్టే అన్నది ఆ ఫ్లెక్సీలోని మరో అంశం.కూటమి సర్కార్ జగన్ హయాంలో చేపట్టి ఓడరేవులు, వైద్య కళాశాలలు మొదలైన వాటిని ప్రామాణికంగా చూపి పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నది కడపలో వెలసిన ఫ్లెక్సీలోని మరో కామెంట్. పెట్టుబడిదారుల సదస్సులలో ఏపీలో కొత్తగా వస్తున్న పోర్టుల గురించి చంద్రబాబు ప్రచారం చేశారు. అవన్ని జగన్ శ్రీకారం చుట్టినవే. గతంలో జగన్ ‘‘గడప గడపకు...’’ పేరుతో పార్టీ నేతలందరిని ప్రజల ఇంటింటికి పంపిస్తే ప్రస్తుతం చంద్రబాబు కూడా అదే తరహాలో కూటమి ఎమ్మెల్యేలు, కేడర్‌ను ‘‘తొలి అడుగు’’ పేరుతో ప్రజల వద్దకు పంపుతున్నారు.'నీ పర్యటనలు ఆపడానికి అష్టకష్టాలు పడి ఏమి చేయాలో అర్థం కాక ఆ బాధ అంతా మంత్రులపై తిట్ల దండకం అయ్యేలా చేశావ్’’ అన్నది ఇంకో కామెంట్‌. జగన్ టూర్లు, ఆయనకు ప్రజలలో వస్తున్న మద్దతు మొదలైనవాటిని గమనించిన చంద్రబాబు గత మంత్రివర్గ సమావేశంలో మంత్రులు పలువురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు గట్టిగా జవాబు ఇవ్వలేకపోతున్నారని ఆయన వాపోయారని వార్తలు వచ్చాయి. జగన్ పర్యటనల ఫలితంగా కూటమి సర్కార్ ఆయా సమస్యలపై స్పందించక తప్పడం లేదు. మిర్చి ,పొగాకు, మామిడి రైతుల వద్దకు జగన్ వెళ్లి పరామర్శ చేయడంతో ప్రభుత్వం హడావుడి పడి కొంత నిధులు ఇవ్వడం, కేంద్రానికి లేఖలు రాయడం వంటివి చేసింది. 'నీకు 11 సీట్లే వచ్చినా పాలన అంతా నీ కనుసన్నలలోనే జరుగుతా ఉన్నట్లు ఉంది జగనూ" అన్న వ్యాఖ్య ఈ ఫ్లెక్సీలో కొసమెరుపు. ఈ ఫ్లెక్సీపై ఎవరి పేరైనా ఉంటే ఈపాటికి రెడ్ బుక్ ప్రయోగం జరిగేదేమో! గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని అంటే, అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరవేసుకోవల్సిందేనని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాని వైఎస్సార్‌ ముఖ్యమంత్రై రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు తాను ఇంకా ఎక్కువ సమయం ఉచిత విద్యుత్ ఇస్తానని ప్రకటించారు.గత టరమ్‌లో కాని, ఇప్పుడు కాని అది కొనసాగుతూనే ఉంది. వైఎస్ తీసుకు వచ్చిన ఆరోగ్యశ్రీని తొలుత టీడీపీ వ్యతిరేకించింది. కాని తదుపరి అది కూడా అమలు చేయక తప్పలేదు. ఫీజ్ రీయింబర్స్ మెంట్ స్కీముల విషయం కూడా అంతే. వైఎస్ చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను కాని, హైదరాబాద్ చుట్టూరా జరిగిన అభివృద్ది కాని తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు చేసే ప్రసంగాలు కూడా వైఎస్ పాలనను గుర్తు చేస్తాయి. అలాగే గత టరమ్‌లో వైఎస్ జగన్ తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్, భూముల రీసర్వే తదితర కార్యక్రమాలను చంద్రబాబు ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది.ఎన్టీఆర్‌ కాలంలో పరిపాలనను మండల స్థాయికి తీసుకు వెళితే, జగన్ ప్రజల వద్దకు పాలనను గ్రామ స్థాయికి తీసుకువెళ్లి ఎంతో సదుపాయం కలిగించారు. కాకపోతే జగన్ తెచ్చిన స్కీములను కాదనలేక కొన్నిటిని నీరు కార్చడానికి చంద్రబాబు యత్నిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయినా సుదీర్ఘకాలం సీఎంగా ఉన్న చంద్రబాబు ఇలా ఎన్ని వ్యవస్థలను ప్రజలకు ఉపయోగపడేలా తేగలిగారన్నది చర్చనీయాంశం. ఆయన గతంలో ఇంకుడు గుంతలు, జన్మభూమి వంటివాటిని ప్రవేశపెట్టారు. కాని వాటిని ఆయనే కొనసాగించలేకపోయారు.ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో లక్షల కోట్ల వ్యయం చేయాలని చంద్రబాబు తలపెట్టారు. దాని ప్రభావం ఇతర ప్రాంతాలలో ఎలా ఉంటుందో అప్పుడే చెప్పలేం. వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లతో పోల్చితే చంద్రబాబుకు విశేషమైన అవకాశాలు వచ్చినా వాటిని సామాన్య ప్రజల కోసం కాకుండా ధనవంతుల ప్రయోజనాల కోసం చేశారన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. ఇప్పుడు తనకంటే చిన్నవాడైన జగన్ ప్రభుత్వంలో అమలు అయినవాటిని చంద్రబాబు అనుసరించవలసి రావడం చారిత్రక సత్యం అని ఒప్పుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Kollywood Hero Siddharth Responds On Cameo Role In Jr Ntr Baadshah Movie10
జూనియర్ ఎన్టీఆర్‌ సినిమాలో కెమియో రోల్‌.. ఎందుకు చేశానంటే: సిద్ధార్థ్

కోలీవుడ్ హీరో సిద్ధార్థ్‌ ఇటీవలే 3బీహెచ్‌కే మూవీతో ప్రేక్షకులను అలరించాడు. శ్రీ గణేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ఫర్వాలేదనిపించింది. ఈ మూవీలో మీతా రఘునాథ్‌ హీరోయిన్‌గా మెప్పించింది. ఈ చిత్రంలో శరత్ కుమార్, దేవయాని కీలక పాత్రల్లో మెప్పించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సిద్ధార్థ్ తెలుగు సినిమాలో కెమియో రోల్‌ చేయడంపై స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన బాద్‌షా మూవీలో మీరెందుకు ఆ రోల్ చేయాల్సి వచ్చిందని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. తన ఫ్రెండ్‌ అడగడంతోనే ఆ రోల్ చేశానని సిద్దార్థ్‌ తెలిపారు. ఏంటండి ఇలా అడిగారు.. ఎన్టీఆర్ సినిమాలో ఒక ఫ్రెండ్‌ అడిగితే ఐదు నిమిషాల రోల్‌ చేశా.. ఆ రోల్ చేయడాన్ని చాలా బాగా ఎంజాయ్ చేసినట్లు వెల్లడించారు. అంత పెద్ద హీరో, పెద్ద సినిమాలో.. అది కూడా నా క్యారెక్టర్ పేరు సిద్ధు అని పెడితే ఎందుకు చేయకుండా ఉంటామని బదులిచ్చారు.కాగా.. తెలుగులో బొమ్మరిల్లు సినిమాతో ఫేమస్ అయిన సిద్ధార్థ్ టాలీవుడ్‌లో నటించారు. ఆ తర్వాత కోలీవుడ్‌లో చాలా చిత్రాల్లో హీరోగా చేశారు. అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్‌లోనూ చేస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాకుండా గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు సిద్ధార్థ్. హీరోయిన్ అదితి రావు హైదరీని ఆయన పెళ్లాడారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement