మాడు పగిలే ఎండలు
భువనగిరిటౌన్ : జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. సోమవారం సంస్థాన్‌నారాయణపురం, బీబీనగర్, బొమ్మలరామారం మండలాల్లో 39 డిగ్రీలు, మరో నాలుగు మండలాల్లో 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణ కంటే నాలుగు డిగ్రీల వరకు అధికంగా నమోదవుతుండడం, ఎండవేడిమికి ఉక్కపోత తోడవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే మూడు రోజులు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో జిల్లాను ఎల్లో జోన్‌గా వాతావరణ శాఖ ప్రకటించింది. బయటకు బయటికెళ్లేటప్పుడు నీళ్లు, చల్లని ద్రవపదార్థాలు తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.
సోమవారం ఇలా..
మండలం ఉష్ణోగ్రత
నారాయణపురం 39.0
బీబీనగర్ 39.0
బి.రామారం 39.0
మోటకొండూరు 38.4
చౌటుప్పుల్ 38.3
రాజాపేట 38.1
ఆత్మకూరు 38.1
ఆలేరు 37.9
భువనగిరి 37.0
మోత్కూరు 37.0
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
ఫ మూడు మండలాల్లో 39 డిగ్రీలు నమోదు
ఫ జిల్లాను ఎల్లో జోన్‌గా ప్రకటించిన వాతావరణ శాఖ
మాడు పగిలే ఎండలు
Comments
Please login to add a commentAdd a comment