
పలకరించి.. సమస్యలు తెలుసుకొని..
రామన్నపేట : పల్లెబాట కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ హనుమంతరావు సోమవారం రామన్నపేట మండలం ఇస్కిళ్లలో పర్యటించారు. ఉదయం 5.30 గంటలకే గ్రామానికి చేరుకున్నారు. స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ గంగాధర్, డీపీఓ సునంద, డీఆర్‌డీఓ నాగిరెడ్డితో కలిసి సుమారు నాలుగు గంటలు గ్రామంలో పర్యటించారు. సంక్షేమ పథకాల అమలుపై నేరుగా ప్రజలతో మాట్లాడారు. రేషన్ కార్డులో పిల్లలు, కోడళ్ల పేర్లు లేవని, గ్యాస్ సబ్సిడీ రావడం లేదని, గ్యాస్ కనెక్షన్ లేదని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా పరిష్కరించాలని అక్కడికక్కడే అధికా రులను ఆదేశించారు. రైతుభరోసా రాలేదని ఒక రైతు తెలియజేయగా.. వ్యవసాయ అధికారి యాప్ లో పరిశీలించి ప్రాసెస్‌లో ఉందని తెలిపారు. ఉపాధి పథకం సిబ్బంది పనితీరు, వేతనాల చెల్లింపుపై ఆరా తీశారు. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాను పరిశీలించారు. బోధకాలతో బాధపడుతున్న వలీ మాబేగంకు పింఛన్ మంజూరు చేయాలని డీఆర్‌డీఓను ఆదేశించారు. సుమధుర పౌండేషన్‌వారు రూ.2 కోట్లతో నిర్మించిన పాఠశాలను, అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి వసతులు, ల్యాబ్‌ను చూశారు. అలాగే బాలింతలు, గర్భిణులకు అందజేస్తున్న సేవలపై ఆరా తీశారు. నర్సరీని సందర్శించారు. గ్రామస్తుల విన్నపం మేరకు ప్రాథమికోన్నత పాఠశాల అప్‌గ్రేడ్‌కు అవసరమైన ప్రతి పాదనలు పంపించాలని ఎంఈఓను ఆదేశించారు. విద్యాసంస్థల సమయా నికి బస్సులు నడపాలని ఆర్‌ఎంను ఆదేశించారు. వీటితో పాటు మరికొన్ని ఆహామీలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లాల్‌బహదూర్, ఎంపీడీఓ యాకుబ్‌నాయక్, ఏఓ తదితరులు ఉన్నారు.
పెద్దమ్మా.. పింఛన్ వస్తుందా
గుండా పుష్పమ్మ ఇంటికి వెళ్లి పెద్దమ్మా.. పింఛన్ వస్తుందా అని కలెక్టర్ ఆప్యాయంగా పల కరించారు. కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీళ్లు వస్తున్నాయా, ఉచిత కరెంట్ బిల్లు కడుతున్నావా? గ్యాస్ సబ్సిడీ వస్తుందా అని అడిగారు. భగీరథ నీళ్లను వేడిచేసుకొని తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆమెకు సూచించారు.
ఫ ఇస్కిళ్లలో కలెక్టర్ పల్లెబాట
ఫ నాలుగు గంటలు గ్రామంలో
పర్యటించి సమస్యలపై ఆరా..

పలకరించి.. సమస్యలు తెలుసుకొని..
Comments
Please login to add a commentAdd a comment