చిన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరించండి
భువనగిరిటౌన్ : రాజీపడదగిన కేసుల్లో సంబంధిత కక్షిదారులకు నోటీసులు ఇవ్వాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు ఆదేశించారు. ఈనెల 8న జరిగే జాతీయ లోక్‌అదాలత్ నేపథ్యంలో సోమవారం జిల్లాలోని న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసు అధికారులతో సమావేశమై పెండింగ్ కేసులపై సమీక్షించారు. చిన్నచిన్న కేసులను రాజీమార్గంలో పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కా ర్యదర్శి మాధవిలత, జిల్లా కోర్టు ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఉషశ్రీ, అదనపు సీని యర్ సివిల్ జడ్జి శ్యామ్‌సుందర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కవిత, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment