శిక్షణతో బోధనపై పట్టు
భువనగిరి: నూతన ఉపాధ్యాయులు బోధనపై పట్టు పెంచుకునేందుకు శిక్షణ తరగతులు దోహపడుతాయని డీఈఓ సత్యనారాయణ పేర్కొన్నారు. డీఎస్సీ– 2024 ద్వారా గత అక్టోబర్‌లో నియామకమైన 133 మంది స్కూల్ సెకండరీ గ్రేడ్ (ఎస్‌జీటీ) టీచర్లకు భువనగిరిలోని శ్రీసాయికృప డిగ్రీ కళాశాలలో మార్చి 28నుంచి ఇస్తున్న వృత్తి శిక్షణ సోమవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి డీఈఓ హాజరై మాట్లాడారు. తరగతి గది నిర్వహణ, అభ్యసన ప్రక్రియలపై శిక్షణలో నేర్చుకున్న విషయాలను బోధనలో అమలు చేయాలని సూచించారు. విద్యార్థులు చదువులో సామర్థ్యాలను చాటేలా తీర్చిదిద్దాలని కోరారు. శిక్షణలో నేర్చుకున్న విషయాల గురించి డీఈఓ వారిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి జె.శ్రీనివాస్, రిసోర్స్‌పర్సన్లు యాదిరెడ్డి, వెంకటేశ్వర్లు, సంధ్య, లావణ్య, లత, శ్రీశైలం, వెంకన్న, రహీం, ఉదయ్ కుమార్, టెక్నికల్ పర్సన్ సునీల్ పాల్గొన్నారు.
ఫ డీఈఓ సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment