యాదగిరిగుట్ట పాలిటెక్నిక్ కాలేజీలో నేడు టెక్ ఫెస్ట్
యాదగిరిగుట్ట : 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి నల్లగొండ జిల్లా పాలిటెక్నిక్ కళాశాలల సృజన టెక్ ఫెస్ట్‌కు యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ వేదిక కానుంది. మంగళవారం ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించే టెక్ ఫెస్ట్‌లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగం విద్యార్థులు స్టాల్స్ ఏర్పాటు చేసి ఎగ్జిబిట్‌లను ప్రదర్శించనున్నారు.ఉత్తమ ప్రాజెక్టును ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ టెక్ ఫెస్ట్ నిర్వహిస్తుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గుట్ట పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు కోరారు.
సాగునీటిపై సమీక్ష
భువనగిరిటౌన్ : రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారి సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సాగునీటి సరఫరా, నీటిపారుదల శాఖ పని తీరుపై సమీక్షించారు. పంటలకు రానున్న పది రోజులు కీలకమని, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. నల్ల గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు చోట్ల సాగునీటి సమస్య ఉందని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పొలాలు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కాలువలకు విడుదల చేసి నీటిని చివరి ఆయకట్టుకు అందేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హనుమంతరావు, విద్యుత్, వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఆర్చరీలో సత్తాచాటిన సర్వేల్ గురుకులం విద్యార్థి
సంస్థాన్ నారాయణపురం : సంగారెడ్డి జిల్లా కొల్లూరులో ఈనెల 2వ తేదీన నిర్వహించిన బాలబాలికల రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో సంస్థాన్‌నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల పాఠశాల తన్వీత్‌ప్రేమ్‌చంద్ ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. అండర్–15 విభాగంలో తృతీయ స్థానంలో నిలిచాడు. తన్వీత్‌ప్రేమ్‌చంద్ తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. అతన్ని ప్రిన్సిపాల్ సతీష్‌కుమార్, పీడీ రామకృష్ణ, ఉపాధ్యాయులు అభినందించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణం
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూని వర్సిటీలోని అంతర్జాతీయ ప్రమాదాలతో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తామని వీసీ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ పేర్కొన్నారు. సోమవారం ఎంజీయూలో 2,160 చదరపు మీటర్ల ఇండోర్ స్టేడియం ఫ్లోరింగ్, 400 మీటర్ల ఎనిమిది లేన్ల ట్రాక్‌ను సింథటిక్ ట్రాక్‌గా మార్చేందుకు ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వాలీబాల్, షటిల్, బాస్కెట్ బాల్, కబడ్డీ వంటి క్రీడల్లో విద్యార్థులకు అధునాతన సింథటిక్ ట్రాక్ మై దానంపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈపీఐ ప్రతినిధి నారాయణనాయక్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం వరకు క్రీడాప్రాంగణాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి, డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ హరీష్‌కుమార్, ప్రొఫెసర్ ఆకుల రవి, స్పెషల్ ఆఫీసర్ సోమలింగం తదితరులు పాల్గొన్నారు.
ఆస్తిపన్ను వందశాతం వసూలు చేయాలి
ఆత్మకూరు(ఎం): గడువు లోపు వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని డీపీఓ ఆర్.సునంద అధికారులకు సూచించారు. ఆత్మకూర్(ఎం) గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సో మవారం ఆమె తనిఖీ చేసి రికార్డులను పరి శీలించారు. పన్నుల వసూళ్లలో వేగం పెంచా లని గడువులోపు లక్ష్యాన్ని చేరుకోవాలని సూ చించారు. వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
యాదగిరిగుట్ట పాలిటెక్నిక్ కాలేజీలో నేడు టెక్ ఫెస్ట్
యాదగిరిగుట్ట పాలిటెక్నిక్ కాలేజీలో నేడు టెక్ ఫెస్ట్
Comments
Please login to add a commentAdd a comment