హాలియా: హాలియా పట్టణంలోని వీరయ్యనగర్ కాలనీలో సోమవారం దొంగలు బీభత్సం సృష్టించారు. మూడు ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరయ్యనగర్ కాలనీలో నివాసముంటున్న రిటైర్డ్ వెటర్నరీ ఉద్యోగి తుమ్మరుగొట్టి రామలింగయ్య, అతడి భార్య కళావతి ఇంటికి తాళం వేసి సోమవారం ఉదయం నల్లగొండకు వెళ్లారు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న 4.75 తులాల బంగారు గొలుసు, బంగారు ఉంగరాలు అపహరించారు. అదే ఇంటిపైన నివాసముంటున్న శాగం వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఇంట్లోకి కూడా చొరబడి బీరువాలో దాచిన 15తులాల వెండి పట్టా గొలుసులు, రూ.10వేల నగదు ఎత్తుకెళ్లారు. అదే ఇంటి పక్కన నివాసముంటున్న అలుగుబెల్లి ఇంద్రారెడ్డి ఇంట్లోనూ చోరీకి యత్నించి విఫలమయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సతీష్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీంను పిలిపించి వేలిముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్‌రెడ్డి తెలిపారు.
మూడు ఇళ్ల తాళాలు పగులగొట్టి
బంగారం, నగదు చోరీ
Comments
Please login to add a commentAdd a comment