రంగస్థల కళాకారులకు ఆదరణ కరువు
పింఛన్ల కోసం ఢిల్లీకి వెళ్లి వచ్చాం
పేదరికంలో ఉన్న కళాకా రులకు పింఛన్లు ఇప్పించాలనే తపనతో ఢిల్లీకి పలుమార్లు వ్యయ ప్రయాసలతో వెళ్లివచ్చాం. అయినప్పటికీ రెండు ప్రభుత్వాలు పేద కళాకారులను పట్టించుకోవడంలేదు. వెంటనే అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేసి వారి సంక్షేమానికి నిధులు విడుదల చేయాలి.
– బోనగిరి ప్రకాష్‌బాబు, కళాకారుల సంఘం హుజూర్‌నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు
మఠంపల్లి: ఎంతో మంది ప్రజలకు తమ కళల ద్వారా వినోదం, ఆనందం పంచిన, పంచుతున్న రంగస్థల కళాకారుల కుటుంబాలకు నేడు గ్రామాల్లో ఆదరణ కరువైంది. నాటి చరిత్ర, ఇతిహాస, పురాణాలే కాకుండా సమాజంలో నెలకొంటున్న పరిస్థితులపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు సాంఘిక, ఫౌరాణిక, బుర్రకథ, జానపదాలతో ప్రజలకు మేలుకొలుపు కలిగిస్తూ కళా ప్రదర్శనలు ఇచ్చిన కుటుంబాలు నేడు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒక పక్క ప్రపంచీకరణ నేపథ్యంలో వచ్చిన మార్పులను తట్టుకుంటూనే రంగస్థలాన్ని కాపాడుకుంటూ గ్రామాల్లో, పట్టణాలలో సైతం స్టేజీలపై తమ స్వంత ఖర్చులు, కొంతమేర దాతల సహకారంతో నాటకాలు ప్రదర్శిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సమాజంలోని అనేక రంగాల వారికి వివిధ రూపాలలో ఆదుకుంటున్నా రంగస్థల కళాకారుల ప్రదర్శనలకు ఎలాంటి ఆర్థిక సహకారం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోనే సుమారు 2000మందికి పైగా కళాకారులు సుమారు 120నాటక సమాజాలను రిజిష్టర్డ్ చేయించుకుని తమ సొంత ఖర్చులతో సత్యహరిశ్చంద్ర, బాలనాగమ్మ, చింతామణి, శ్రీకృష్ణరాయబారం, రామాంజనేయ యుద్ధం, పల్నాటి యుద్ధం నాటకాలు ప్రదర్శిస్తున్నారు.
10ఏళ్లుగా పట్టించుకోని ప్రభుత్వాలు..
గతంలో ప్రభుత్వం పలురకాల కార్యక్రమాలకు జనాభా నియంత్రణ, మద్యపానం, చదువు వెలుగు, పుష్కరాలు తదితర కార్యక్రమాలను కళాకారులతో జిల్లా పౌరసంబంధాల శాఖ ద్వారా పనులు కల్పించేవారు. సుమారు 10 సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి కళాకారులకు ఎలాంటి ఆదరణ దక్కడం లేదు. ముఖ్యంగా రంగస్థల కళాకారులకు కేంద్ర రూ.6వేలు, రాష్ట్ర రూ.3వేలు చొప్పున పింఛన్లు ఇస్తుంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం 10ఏళ్లుగా, కేంద్రం 4ఏళ్లుగా పింఛన్లు ఇవ్వకుండా వదిలేశారు. జిల్లాలో 200మంది మాత్రమే పింఛన్లు మంజూరైన వారు ఉన్నారని, కొత్త పింఛన్ల కోసం కళాకారుల యూనియన్ నాయకులు పలుమార్లు హైదరాబాద్, ఢిల్లీ వరకు వెళ్లినట్లు తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వాలు నిరుపేద రంగస్థల కళాకారులకు పింఛన్లు, ఇండ్లు, రైలు, బస్‌పాసులు, హెల్త్‌కార్డులు, సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారా గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరుతున్నారు.
కేవలం 200 మందికే పింఛన్లు
జిల్లాలో నిరుపేద కళాకా రులు వేలమంది ఉన్నా రు. కేవలం 200 మందికి మాత్రమే పింఛన్లు మంజూరయ్యాయి. అవి కూడా పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ప్రభుత్వం సమాజ హితం కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న కళాకారులను పట్టించుకోవాలి. అధికారులు దరఖాస్తులు వెంటనే పరిశీలించి కొత్త పింఛన్లు మంజూరు చేసి ఆదుకోవాలి. – కంబాల శ్రీనివాస్‌నాయుడు,
కళాకారుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు
ప్రజావాణిలోనూ విన్నవించాం
కళాకారులకు గుర్తింపుకార్డులు, పింఛన్లు, బస్‌పాస్‌లు ఇప్పించాలని ఈ ప్రభుత్వం వచ్చిన రెండునెలలకే హైదరాబాద్ వెళ్లి సీఎం ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేశాం. నేటికీ ఆ ఊసేలేదు. పేద కళాకారులు ఎంతో ఆశతో ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
– భద్రంరాజు వెంకటరామారావు,
కళాకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు
సినిమాలు, టీవీ షోల ప్రభావంతో
ఉనికి కోల్పోతున్న కళాకారులు
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కుటుంబాలు
ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూపు
రంగస్థల కళాకారులకు ఆదరణ కరువు
రంగస్థల కళాకారులకు ఆదరణ కరువు
రంగస్థల కళాకారులకు ఆదరణ కరువు
రంగస్థల కళాకారులకు ఆదరణ కరువు


