రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
● మృతుడు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి వాహన డ్రైవర్
నిడమనూరు: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన నిడమనూరు మండలం వేంపాడు గ్రామ శివారులో సోమవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన ఉప్పునూతల నరసింహ(41) మిర్యాలగూడలోని బాపూజీనగర్‌లో నివాసముంటూ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నరసింహ సోమవారం బైక్‌పై స్వగ్రామానికి వచ్చి తిరిగి మిర్యాలగూడకు వెళ్తుండగా.. నిడమనూరు మండలం వేంపాడు గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నరసింహను 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య ఉప్పునూతల రామేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నరేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


