గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి
చౌటుప్పల్ రూరల్: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల పంచాయతీ కార్యదర్శులు, చౌటుప్పల్ మున్సిపాలిటీలోని వార్డు ఆఫీసర్లు, ఉపాధి హామీ పథకం అధికారులు, మిషన్ భగీరథ అధికారులతో మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులు పడకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులపై ఆరా తీశారు. సమావేశంలో డీఆర్‌డీఓ ఏడీ నాగిరెడ్డి, డీపీఓ సునంద, ఎంపీడీఓ సందీప్, మిషన్ భగీరథ డీఈ దీన్‌దయాల్, మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, ఎంపీఓ అంజిరెడ్డి, నర్సింహారావు పాల్గొన్నారు.


