డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష
సూర్యాపేటటౌన్: డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఏడుగురికి రూ.1500 జరిమానాతో పాటు ఒకరికి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ బుధవారం సూర్యాపేట జిల్లా సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ బీవీ రమణ తీర్పు వెలువరించినట్లు ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం తెలి పారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి సూర్యాపేట పట్టణంలోని కొత్తబస్టాండ్ వద్ద నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఏడుగురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని బుధవారం కోర్టులో హాజరుపర్చగా.. జడ్జి రూ.1500 జరిమానాతో పాటు ఒకరికి రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త
అడవిదేవులపల్లి: భార్యపై అనుమానంతో భర్త ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ముదిమాణిక్యం గ్రామానికి చెందిన పూజల బాలసైదులుకు అదే గ్రామానికి చెందిన గువ్వ ల శివయ్య కుమార్తె నరసకుమారీ(30)తో 14ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్ల లున్నారు. నరసకుమారి మరో వ్యక్తితో వివా హేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో బాలసైదులు తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలసైదులు కత్తితో నరసకుమారిని పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన బైక్‌పై పరారయ్యాడు. బుధవారం తెల్ల వారుజామున స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మిర్యాలగూడ రూరల్ సీఐ పి. నాగదుర్గ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి శివ య్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శేఖర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి దుర్మరణం
శాలిగౌరారం: బంధువుల ఇంటి వద్ద శుభకార్యానికి హాజరై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలం ఎన్‌జి కొత్తపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డగూడూరు మండలం లక్ష్మిదేవికాల్వ గ్రామానికి చెందిన బండి యాదగిరి(55) మంగళవారం కట్టంగూర్ మండలం నారెగూడెంలో తన బంధువుల ఇంట్లో జరిగిన ఎల్లమ్మ పండుగకు బైక్‌పై వెళ్లాడు. తిరిగి రాత్రి తన బంధువులైన బూడిద భిక్షం, బూడిద యాదయ్యను యాదగిరి బైక్‌పై ఎక్కించుకుని వారి ఊరైన శాలిగౌరారం మండలం ఎన్‌జి కొత్తపల్లిలో దింపేందుకు వెళ్తున్నాడు. మార్గమధ్యలో శాలిగౌరారం మండలం తక్కెళ్లపహాడ్ గ్రామానికి రాగానే.. బూడిద భిక్షం, బూడిద యాదయ్యను తీసుకెళ్లేందుకు మరో బైక్ రాగా వారు దానిపై ఎక్కి వెళ్లారు. యాదగిరి ఎన్‌జి కొత్తపల్లి మీదుగా లక్ష్మిదేవికాల్వ గ్రామానికి వెళ్తుండగా.. ఎన్‌జి కొత్తపల్లి గ్రామ శివారులో గజ్జి అంజయ్య తన పొలంలో వరి పంట కోస్తుండగా ధాన్యం తీసుకెళ్లడానికి రోడ్డు వెంట ట్రాక్టర్‌ను నిలిపి పొలంలోకి వెళ్లాడు. అదే రోడ్డు వెంట వేగంగా వచ్చిన బండి యాదగిరి నిలిచి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో యాదగిరికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, వివాహితులైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించి, బుధవారం మృతుడి పెద్ద అల్లుడు చిలుకూరి యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


