మిర్యాలగూడ పట్టణంలో కార్డన్ సెర్చ్
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్‌లో గురువారం తెల్లవారుజామున 4గంటల నుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు బృందాలుగా విడిపోయి సోదాలు చేశారు. అనంతరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజశేఖర రాజు కార్డన్ సెర్చ్ వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో చేపట్టిన కార్డన్ సెర్చ్‌లో భాగంగా పలువురు అనుమానిత వ్యక్తులను గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. అదేవిధంగా 56 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలను సీజ్ చేసినట్లు తెలిపారు. వీటిలో నంబర్ ప్లేట్ లేని 12 ద్విచక్ర వాహనాలు ఉండగా నాలుగు ఆటోలకు సరైన ధ్రువవపత్రాలు లేనట్లు గుర్తించామన్నారు. పలు వాహనాల నంబర్లు ట్యాంపరింగ్ చేసినట్లు గుర్తించామని, ఈ వాహనాలు ఎక్కడి నుంచి వచ్చాయి..? ఏదైనా నేరాలకు పాల్పడ్డారా..? అనే కోణంలో విచారణ చేస్తున్నామని తెలిపారు. మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిరంతరం కొనసాగుతుందని, అనుమానిత వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నట్లు అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, రోడ్లపై అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్డన్ సెర్చ్‌లో సీఐలు పీఎన్‌డీ ప్రసాద్, సోమనర్సయ్య, మోతీరాంతో పాటు 12మంది ఎస్‌ఐలు, 75మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
ఫ సరైన పత్రాలు లేని
60 వాహనాలు సీజ్
ఫ వివరాలు వెల్లడించిన
డీఎస్పీ రాజశేఖర రాజు


