హక్కులను కాలరాసే కుట్ర చేస్తున్న బీజేపీ
కోదాడ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కులను కాలరాసే కుట్ర చేస్తోందని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన శ్రీజై బాపు– జై భీమ్– జై సంవిధాన్‌శ్రీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని దాని కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తల చేత ఆయన ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎస్‌కె. బషీర్, వరప్రసాదరెడ్డి, సామినేని ప్రమీల, కందుల కోటేశ్వరరావు, షాబుద్దీన్, కాంపాటి శ్రీను, సైదిబాబు, కట్టెబోయిన శ్రీను, కోల్లా కోటిరెడ్డి పెండెం వెంకటేశ్వర్లు, రాజు, డాక్టర్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
ఫ వికలాంగుల కార్పొరేషన్
చైర్మన్ వీరయ్య


