అకాల వర్షం.. రైతుకు నష్టం
ఉదయం ఎండ, సాయంత్రం వర్షం
భువనగిరిటౌన్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో పలు మండలాల్లో మోస్తరు నుంచి వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదరుగాలులు వీచాయి. సాయంత్రం 4 గంటల వరకు ఎండ కాయగా ఆ తరువాత మబ్బులు పట్టి వాతావరణం ఒక్కసారిగా చల్లడింది. సగటున 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేశారు.
గుండాల : జిల్లాలోని పలు మండలాల్లో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోయింది. ఈదురుగాలులకు చేతికొచ్చి మామిడి నేలరాలింది. కోత దశలో ఉన్న వరి నేలవాలింది. కరెంట్ తీగలు తెగిపడడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గుండాల మండల కేంద్రంలో బండపై ఆరబెట్టిన వడ్లు పక్కనే ఉన్న రామసముద్రం చెరువులోకి కొట్టుకుపోయాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ పరిస్ధితి వచ్చిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆత్మకూర్(ఎం) : మండలంలో గంటసేపు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షానికి రహీంఖాన్‌పేటలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొట్టుకుపోయింది. అదే విధంగా కరెంట్ తీగలు తెగిపడడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
అడ్డూగూడూరు : ఈదురుగాలులకు పలు గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలయి. వరి చేలు నేలకొరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసింది.
ఆలేరురూరల్ : మండలంలోని మంతపురికి చెందిన పల్లా రాజిరెడ్డి తన వ్యవసాయ బావి వద్ద గేదెను చెట్టుకు కట్టేయగా పిడుగుపాటుకు మృతి చెందింది. గేదె విలువ రూ.50వేలు ఉంటుందని, ప్రభుత్వపరంగా ఆదుకోవాలని రాజిరెడ్డి కోరాడు.
మోత్కూరు : మండలంలోని పలు గ్రామాల్లో ఏ ర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. మోత్కూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో పనకబండకు చెందిన నల్లపోగుల సతీష్ రెండు ట్రాక్టర్ల ధాన్యం ఆరబోయగా అందులో మూడు క్వింటాళ్ల వడ్లు వరదలో కొట్టుకుపోయాయి.
ఫ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
ఫ నేలరాలిన మామిడి, దెబ్బతిన్న వరి చేలు
ఫ విద్యుత్ సరఫరాకు అంతరాయం
మండలం వర్షం ఉష్ణోగ్రత
(మి.మీ) (డిగ్రీలు)
అడ్డగూడూరు 11.8 40.9
ఆత్మకూర్(ఎం) 18.8 40.7
గుండాల 7.0 40.5
మోత్కురు 44.0 40.4
మోటకొండూరు 4.5 40.4
రామన్నపేట 7.8 40.3
నారాయణపురం 3.8 40.8
ఆలేరు 31.8 40.1
భువనగిరి 6.4 39.0
వలిగొండ 15.5 39.0
అకాల వర్షం.. రైతుకు నష్టం
అకాల వర్షం.. రైతుకు నష్టం


