1,200 మందికి ఉద్యోగ అవకాశాలు
బీబీనగర్: బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి తరుణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం బీబీనగర్‌లో నిర్వహించిన జాబ్ మేళాలో 1,200మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. మేళాలో 63 కంపెనీలు పాల్గొనగా 250 మందికి వెంటనే ఉద్యోగాలు కల్పించి నియామక పత్రాలు అందజేశారు. మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్‌సుందర్‌రావు మేళాను ప్రారంభించి మాట్లాడారు. యువతకు ఉద్యోగవకాశాలు కల్పించేందుకు కంపెనీలతో జాబ్‌మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు పొట్ట నవీన్‌కుమార్, దాసమోని వెంకటేశ్, శ్యామ్, రవి, విశ్వనాథ్, శ్రీను, బాలు, వెంకట్, విజయ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.


