యువ వికాసానికి 31,902 అర్జీలు
భువనగిరిటౌన్ : రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువు ముగిసింది. సోమవారం సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా 31,902 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎస్సీ కార్పొరేషన్ 9,874, ఎస్టీ 2,579, బీసీ 16,990, ఈబీసీ 814, మైనార్టీ 1,590, క్రిష్టియన్ మైనార్టీ కార్పొరేషన్‌కు 55 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవడంతో వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా దరఖాస్తు గడువు పెంచినట్లు ప్రచారం జరుగుతుందని, ఇందులో వాస్తవం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయిన నిరుద్యోగుల నుంచి గడువు పెంచాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని, దీనిపై మంగళవారం ఏదైనా నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు
ప్రత్యేక కౌంటర్లు
దరఖాస్తుదారుల నుంచి హార్డ్ కాపీలు స్వీకరించేందుకు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. సోమవారం సెలవు రోజు అయినప్పటికీ సిబ్బంది అందుబాటులో ఉండి హార్డుకాపీలు స్వీకరించారు.
ముగిసిన దరఖాస్తు గడువు
సెలవు రోజూ హార్డు కాపీల స్వీకరణ


