నిధులు సక్రమంగా వినియోగించాలి
సాక్షి, యాదాద్రి : కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో ఒక్క రూపాయి కూడా వదలకుండా ఖర్చు చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ అధ్యక్షతన దిశ (జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ) సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా వివిధ శాఖల అభివృద్ధి పనులకు సంబంధించి పలు అంశాలపై ఎంపీ అధికారులతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు సంబంధిత శాఖలు ఎలా ఖర్చు చేస్తున్నాయి.. అవి ప్రజలకు గ్రౌండింగ్ అవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారుల పనులు వేగవంతం చేయాలని సూచించారు.
బ్రిడ్జిల పనులు పూర్తి చేయాలి: కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే భువనగిరి
మూసీ నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జిల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఏళ్లుగా పనులు పెండింగ్‌లో ఉండటాన్ని ఆయన తప్పు పట్టారు. అమృత్ 2.0 పథకం కింద నిర్మిస్తున్న వాటర్ ట్యాంకులను వెంటనే పూర్తి చేయాలన్నారు. భువనగిరి మున్సిపాలిటీలో మంచి నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుడా చూడాలని మిషనర్ భగీరథ అధికారులకు సూచించారు. అనంతరం దిశా సమావేశానికి హాజరైన ప్రజా ప్రతినిధులను కలెక్టర్ శాలువాలతో సన్మానించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, మందడి ఉపేందర్‌రెడ్డి, సంబంధిత శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఫ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించిన ఎంపీ చామల
కిరణ్‌కుమార్‌రెడ్డి
నిధులిచ్చినా పనులు పూర్తి చేయరా: బీర్ల ఐలయ్య
తాగు నీటి సమస్యల పరిష్కారానికి నిధులు ఇచ్చి ఏడాది దాటినా పనులు పూర్తి కావా అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అధికారులను ప్రశ్నించారు. ఆలేరు మండలం కొలనుపాక, రాఘవాపురం, శ్రీనివాసపురం, పటేల్ గూడెం గ్రామాల్లో మూడు రోజులకోసారి మంచినీరు వస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో పనులు పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు.
నిధులు సక్రమంగా వినియోగించాలి


