ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
మిర్యాలగూడ అర్బన్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని ఆర్టీసి బస్టాండ్ ఎదురుగా గురువారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డకు చెందిన గుంటి ఆదినారాయణ(65) తన స్కూటీపై పట్టణానికి వస్తున్న క్రమంలో అదే రోడ్డులో ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకుడు వేగంగా వచ్చి ఢీ కొట్టాడు. దీంతో ఆదినారయణ తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో ఆదినారాయణ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న డైమండ్ నేత్ర నిధి ప్రతినిధులు బాధిత కుటుంబ సభ్యులను సంప్రదించగా మృతుడి నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు.
● మృతుడి నేత్రాలను
దానం చేసిన కుటుంబ సభ్యులు


