కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా తేలేని అసమర్థులు వారే..
నకిరేకల్: పదేళ్ల పాటు అధికారంలో ఉండి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేలేని అసమర్థులు బీఆర్‌ఎస్ పార్టీ వాళ్లేనని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. నకిరేకల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాల విషయంలో మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే వీరేశం ఖండించారు. 2014లో తాత్కాలికంగా 299 టీఎంసీలను తెలంగాణకు కేటాయిస్తే అవే అసంపూర్తిగా వస్తున్నాయన్నారు. గడిచిన పదేళ్లలో ఉమ్మడి జిల్లాకు కృష్ణానది నుంచి చుక్కనీరు తేలేకపోయారన్నారు. వారు నిజంగా రైతుల పక్షపాతి అయితే బ్రాహ్మణ వెల్లంల, డిండి, నక్కలగండి ప్రాజెక్టులతోపాటు, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం కష్టపడుతుంటే మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా విషయంలో తాము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సమావేశంలో నకిరేకల్ పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, నాయకులు లింగాల వెంకన్న, కంపాసాటి శ్రీనివాస్, నకిరేకంటి నరేందర్, పన్నాల శ్రీనివాస్‌రెడ్డి, యాసారపు వెంకన్న, గడ్డం స్వామి పాల్గొన్నారు.
మా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఊరుకోం
నకిరేకల్ ఎమ్మేల్యే వేముల వీరేశం


