హమాలీల కొరతతో కొనుగోళ్లు జాప్యం
బొమ్మలరామారం : హమాలీల కొరత వల్ల ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఏర్పడిందని, సోమవారం నుంచి అన్ని కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కాంటా వేస్తామని పీఏసీఎస్ చైర్మన్ బాల్ నర్సింహ తెలిపారు. బొమ్మలరామారం మండల వ్యాప్తంగా పది కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటి వరకు ఒక్క కేంద్రాన్ని ప్రారంభించకపోవడం, 20 రోజులుగా రైతులు ధాన్యం కుప్పల వద్ద ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘20 రోజులైనా గింజ కొనలే’ శీర్షికతో శనివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఉన్నతస్థాయి ఆదేశాల మేరకు పీఏసీఎస్ చైర్మన్ నాగినేనిపల్లి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. హమాలీల సమస్యను అధిగమించేందుకు స్థానిక కూలీలతో పాటు బిహార్ కార్మికులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. సోమవారం ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారని వెల్లడించారు.
ఫ 21 నుంచి అన్ని కేంద్రాల్లో ప్రారంభిస్తాం
ఫ పీఏసీఎస్ చైర్మన్ బాల్ నర్సింహ
హమాలీల కొరతతో కొనుగోళ్లు జాప్యం


