ఐలు జిల్లా కమిటీ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ఐలు జిల్లా కమిటీ ఎన్నిక

Apr 21 2025 1:15 PM | Updated on Apr 21 2025 1:15 PM

ఐలు జిల్లా కమిటీ ఎన్నిక

ఐలు జిల్లా కమిటీ ఎన్నిక

భువనగిరిటౌన్‌ : ఆలిండియా లాయర్స్‌ యూని యన్‌ (ఐలు) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం భువనగిరిలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా కుక్కదువ సోమయ్య, అధ్యక్షుడిగా బొల్లపల్లి కుమార్‌, ప్రధాన కార్యదర్శి మామిడి వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా తడక మోహన్‌, పాల్వంచ జగతయ్య, ఎండీ నేహాల్‌ సహాయ కార్యదర్శులుగా సీసా శ్రీనివాస్‌, సూదగాని శ్రీహరి, చింతల రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారిగా బొడ్డు కిషన్‌తో పాటు మరో పది మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. సమావేశంలో జేల్లా రమేష్‌, ఎండీ ఖయ్యూం, యాదాసు యాదయ్య, ఆకుల మల్లే శం, పిడుగు ఐలయ్య, గదగాని శంకర్‌, జిట్టా భాస్కర్‌రెడ్డి, ఎస్‌కే హమీద్‌, కుక్కదువ సాయి, సునీల్‌కుమార్‌, చింతల రాజు, వెన్నెల, భీమగాని శ్రీనివాస్‌, పారునంది రవికుమార్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు

భువనగిరి : ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ఆదివారం ప్రశాతంగా ప్రారంభమయ్యాయి. ఓపెన్‌ టెన్త్‌ పరీక్షలకు జిల్లా కేంద్రంలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 408 విద్యార్థులకు గాను 362 మంది హాజరు కాగా 46 మంది గైర్హాజరయ్యారు. ఓపెన్‌ ఇంటర్‌కు నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,006 మంది విద్యార్థులకు 882 మంది హాజరయ్యారు. 124 మంది గైర్హాజరైనట్లు డీఈఓ తెలిపారు.

జర్మనీలో ఉద్యోగావకాశాలు

భువనగిరి : జర్మనీలో ఉద్యోగ అవకాశాల కోసం నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ట్రిపుల్‌ విన్‌ ప్రాజెక్టు కింద ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఉపాధి కల్పానాధికారి సాహితీ తెలిపారు. గుర్తింపు పొందిన నర్సింగ్‌ కళాశాలలో జీఎన్‌ఎం లేదా బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసి, 21 నుంచి 38 ఏళ్లలోపువారు అర్హులన్నారు. జర్మనీ భాషలో నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈనెల 25లోపు బయోడేటా పంపాలని, వివరాలకు 9440051581, 9440048500ను సంప్రదించాలని కోరారు.

నేడు ప్రజావాణి రద్దు

భువనగిరిటౌన్‌ : కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. భూభారతి పోర్టల్‌పై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండరని, అందుకే ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సామాజిక సేవతో గుర్తింపు

ఆలేరురూరల్‌ : సామాజిక సేవతో సంఘంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభిస్తుందని నేత్ర, అవయవ దాతల అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఖుర్షిద్‌ పాషా పేర్కొన్నారు. ఆలేరుకు చెందిన సినియర్‌ సిటిజన్‌ మొరిగాడి సర్వయ్య తన మరణానంతరం భౌతికదేహాన్ని కాకతీయ మెడికల్‌ కళాశాలకు అప్పగిస్తూ ఆదివారం హామీపత్రం అందజేశారు. సమాజహితం కోసం తన కుటుంబసభ్యులను ఒప్పించి, వైద్య విద్యార్థుల ప్రయోగాల కోసం సర్వయ్య తన శరీరాన్ని దానం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ మో హన్‌రావు, మొరిగాడి మహేష్‌, ముల్లెక్కల ర వికుమార్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement