కాంగ్రెస్ ప్రజావిశ్వాసం కోల్పోయింది
భువనగిరి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ప్రజావిశ్వాసం కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం భువనగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్టాడారు. కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. భువనగిరి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి క్యామ మల్లేశం, మున్సిపల్ మాజీ చైర్మన్ అంజనేయులు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్‌కుమార్, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఖాజా అజీమోద్దీన్, దిడ్డికాడి భగత్, కుశంగుల రాజు, చెన్న మహేష్, కడారి వినోద్, తుమ్మల పాండు, సిద్దుల పద్మ, సుదగాని రాజు, రత్నపురం పద్మ, ఎనబోయిన జహంగీర్, తాడూరి భిక్షపత్తి, తాడెం రాజశేఖర్, పాల్గొన్నారు.
ఫ భువనగిరి మాజీ ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి


