మండే ఎండల్లో జర భద్రం
నిరుపయోగంగా ఆస్పత్రి భవనం
మోటకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంఆవరణలో నిర్మించిన 30 పడకల భవనం నిరుపయోగంగా ఉంది.
జైలును పరిశుభ్రంగా ఉంచాలి
జైలును పరిశుభ్రంగా ఉంచాలని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ జైలు సిబ్బందికి సూచించారు.
- IIIలో
శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
- IIలో
ఫ రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఫ 42 డిగ్రీలకుపైగా నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు
ఫ మే నెలలో 46 డిగ్రీలకు చేరే అవకాశం
ఫ ఇప్పటికే ఆల్ట్రా వైలెట్ (యూవీ) 10 శాతం నమోదు
ఫ ఈ పరిస్థితుల్లో జనంతోపాటు.. పశుపక్షాదులకు జాగ్రత్తలు తప్పనిసరి
ఫ వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను కాపాడుకోవాలి
భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండల తీవ్రత మొదలవుతోంది. రాత్రి 10 గంటలకు కూడా వాతావరణం చల్లబడడం లేదు. ఎండల దాటికి ప్రజలు ఇళ్లనుంచి బయటికి వెళ్లేందుకు జంకుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకున్నాయి. వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు కురిస్తే ఎండలు కాస్త తగ్గే అవకాశం ఉంది. లేదంటే మే నెలలో 46 డిగ్రీలకు మించే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండడంతోపాటు చెట్లను, జీవరాశులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి
ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల వృద్ధులు జాగ్రత్తగా ఉండడం మంచింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళ వృద్ధులు బయటికి వెళ్లొద్దు. చెమటలు బాగా వచ్చి, కళ్లు తిరిగితే సంబంధిత డాక్టర్‌ను కలిసి ఈసీజీ తీయించుకోవాలి. ఎండలకు రక్తపోటు పెరుగుతుంది. రక్తం గడ్డకట్టి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. విరోచనాలు, వాంతులు ఎక్కువగా అయితే డాక్టర్‌ను సంప్రదించాలి. ఎలక్ట్రోలైట్స్ పౌడర్‌ను తీసుకోవాలి. డయాబెటిస్, హైపర్‌టెన్షన్ పేషెంట్లు జాగ్రత్తగా మత్తు, శీతల పానీయాలను ఎక్కువగా తీసుకోవద్దు. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, జ్యూస్‌లు బాగా తాగాలి.
– రమణ, జనరల్ ఫిజిషియన్, సూర్యాపేట
నల్లగొండ : వాతావరణ మార్పుల కారణంగా ఎండలు మండుతున్నాయి. ఓజోన్ పొర దెబ్బతిని సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. దీంతో ఎండ వేడిమి పెరిగి జనం అల్లాడుతున్నారు. డీ హైడ్రేషన్‌కు గురవుతున్నారు. దీనికి తోడు ఏసీల వాడకం పెరగడంతో గాలిలో తేమ శాతం తగ్గిపోతోంది. ఈ కారణంగా జిల్లాలో ఆల్ట్రా వైలెట్ (యూవీ) పది శాతం నమోదవుతోంది. ఆకాశంలో తెల్లటి మేఘాలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జనం జాగ్రతలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి మంగ్యానాయక్ సూచిస్తున్నారు.
కోదాడ, భువనగిరిటౌన్ : చాలా మందికి గార్డెనింగ్ అంటే ఇష్టం. మొక్కల పెంపకంలో చాలా కేర్ తీసుకుంటారు. అయితే, వేసవిలో మొక్కలను కాపాడుకోవడం కష్టంతో కూడుకున్న పని. ఈ చిట్కాలు పాటిస్తే ఎండబారి నుంచి కాపాడుకోవచ్చంటున్నారు.. ఉద్యానవన అధి అధికారులు.
● రోజూ సాయంత్రం ఆరు గంటల తరువాతే మొక్కలకు నీరు పెట్టుకోవాలి.
● ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత మొక్కలపై నేరుగా పడకుండా గ్రీన్‌మ్యాట్ పైకప్పుగా ఏర్పాటు చేసుకోవాలి.
● గ్రీన్‌మ్యాట్‌పై రెండు మూడు గంటలకు ఒకసారి నీటిని చల్లాలి.
● మొక్కలకు రసాయన ఎరువులను అందించవద్దు. మొక్కల పాదుల్లో తడి ఆరకుండా చూసుకోవాలి.
● కుండీల్లో మొక్కలు నాటితే తరచూ మట్టిని మార్చాలి. మట్టిలో ఆవు పేడ కలపాలి. మట్టి ఎక్కువ రోజులు తడిగా ఉండటానికి కుండీలో ఎండిన ఆకులను ఉంచాలి.
● మొక్కలకు వేప పిండిని ఎరువుగా ఉపయోగించవచ్చు.
కోదాడ, రామగిరి(నల్లగొండ), నకిరేకల్ : వేసవిలో జంతు ప్రేమికులు వారి పెంపుడు జంతువుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలు వాటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది.
● ఎప్పటికప్పుడు శుభ్రమైన, చల్లటి నీటిని
అందుబాటులో ఉంచాలి.
● పెంపుడు జంతువు ఉండే ప్రాంతం చల్లదనంగా ఉండేలా చూసుకోవాలి. గాలి వేగంగా వెళ్తున్న స్థలాన్ని ఎంచుకోవాలి.
● మధ్యాహ్నం సమయంలో నేలపై నడవనివ్వకూడదు.
● ఊపిరాడకపోవడం, అలసట, అధిక నిద్ర లాంటి లక్షణాలను గ్రహించాలి. వాటి శరీరానికి తగినంత గాలితీసుకునే అవకాశం ఇవ్వాలి.
● పెంపుడు జంతువులు ఉండే ప్రాంతాన్ని పూర్తిగా మూసివేయకుండా.. గాలి మార్పిడి ఉండేలా చూసుకోవాలి.
● తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి.
● వేసవి ఒత్తిడిని తగ్గించడానికి వాటికి టానిక్‌లను తాగించాలి.
● పక్షుల సంరక్షణకు ఇంటి గోడలు, వరండాలు, డాబాలపై చిన్నచిన్న చిప్పల్లో నీళ్లు పోసి ఉంచాలి.
● వీటి పక్కనే చిరుధాన్యపు గింజలు పోసి ఉంచాలి.
● రోడ్ల వెంట ఉండే చెట్ల మొదళ్ల వద్ద కూడా నీటి వసతులు కల్పించాలి.
మొక్కలకు నీరు పోస్తున్న దాత్రక్ పద్మ
సేవ్ బర్డ్స్ క్యాంపెయిన్‌లో పాల్గొనాలి
వేసవిలో పక్షులు దాహార్తి తీర్చడానికి ప్రజలు తమ ఇళ్లలో వరండాలు, బాల్కానీల్లో నీటి చిప్పలు, కృతిమ గూళ్లను, ఫీడర్లను ఏర్పాటు చేయాలని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు తమ ఇళ్లలో వరండాలు, బాల్కనీల్లో పిట్టగోడలపై పిల్లల చేత నీటి కుప్పలను ఏర్పాటు చేయిస్తే బాగుంటుంది. ధాన్యపు చిప్పలను కూడా ఏర్పాటు చేసి పక్షుల మనుగడకు దోహదపడాలి. సేవ్ బర్డ్స్ క్యాంపెయిన్‌లో అందరూ భాగస్వాములు కావాలి.
– కనుకుంట్ల విద్యాసాగర్‌రెడ్డి, ఉపాధ్యాయుడు, నకిరేకల్
న్యూస్‌రీల్
కిచెన్, టెర్రస్ గార్డెన్‌లను
కాపాడుకోండి ఇలా..
పెంపుడు జంతువులు – జాగ్రత్తలు..
మండే ఎండల్లో జర భద్రం
మండే ఎండల్లో జర భద్రం
మండే ఎండల్లో జర భద్రం
మండే ఎండల్లో జర భద్రం
మండే ఎండల్లో జర భద్రం
మండే ఎండల్లో జర భద్రం


