
చెర్వుగట్టు క్షేత్రంలో లక్ష పుష్పార్చన
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం అమావాస్య సందర్భంగా అర్చకులు లక్ష పుష్పార్చన నిర్వహించారు. గట్టుపైన రాత్రి నిద్ర చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు చెర్వుగట్టుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాత్రి ప్రత్యేకంగా ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, సురేశ్‌శర్మ, సతీష్‌శర్మ, శ్రీకాంత్‌శర్మ అర్చక బృందం, వేద పండితులు ప్రత్యేకంగా మహా మండపంలో లక్ష పుష్పార్చన, సహస్రనామార్చనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు, శివసత్తులు ఆలయం వద్ద బతుకమ్మ ఆడారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో గట్టుపైకి వాహనాలను అనుమతించలేదు. పూజల్లో దేవాలయ ఈఓ నవీన్‌కుమార్, సూపర్‌వైజర్ తిరుపతిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రెడ్డి, నర్సిరెడ్డి, వెంకటయ్య తదితరులు ఉన్నారు.
సాగర్‌లో పర్యాటకుల సందడి
నాగార్జునసాగర్ : సాగర్ కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతుండటంతో ఆ అందాలను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులతో నాగార్జునసాగర్ పరిసరాల్లో ఆదివారం సందడి నెలకొంది. కృష్ణాతీరంతో పాటు ఎత్తిపోతల, బుద్ధవనం అనుపు తదితర ప్రాంతాలను పర్యాటకులు సందర్శించారు. లాంచీల్లో నాగార్జునకొండకు వెళ్లారు. బుద్ధవనంలో ధాన్యం చేశారు.