
క్యాష్‌లెస్ పేమెంట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులు క్యాష్‌లెస్ పేమెంట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ ఈఓ వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి కోరారు. యాదగిరి కొండ పైన పలు చోట్ల ఏర్పాటు చేసిన స్వీయ సేవా కియోస్క్ యంత్రాలను సోమవారం వారు ప్రారంభించి మాట్లాడారు. భక్తుల సౌకర్యార్ధం అఖండ దీపారాధన ప్రాంగణంలో 3, డోనార్ విభాగం, వ్రత మండపం, చౌల్ట్రీస్ వద్ద ఒక్కోటి చొప్పున కియోస్క్ యంత్రాలను అందుబాటులో ఉంచామన్నారు. దీంతో భక్తులు క్యూలో నిలబడే సమయం తగ్గి వేగంగా స్వామివారిని దర్శించుకోవచ్చన్నారు.