
అన్నేశ్వరమ్మ గుట్టపై జైన శాసనం ఆనవాళ్లు
రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణ పరిధిలోని అన్నేశ్వరమ్మ గుట్టపై తెలంగాణ చరిత్ర బృందం పరిశోధనలో జినబ్రహ్మజోగి శాసనం వెలుగుచూసింది. గుట్ట మీద బండపై చెక్కి ఉన్న జినపాదాలకు మూడువైపులా తెలుగన్నడం లిపిలో, కన్నడ భాషలో జినబ్రహ్మజోగి పాద చారుకీర్తి అని ఉన్న శాసనాన్ని చరిత్ర బృందం సోమవారం తొలిసారి గుర్తించారు. గతంలో జగిత్యాల జిల్లా వెల్లటూరు మండలం పాతగూడూరు బయట ఒక రాతిగుండుపై జైన శాసనం ఆనవాళ్లు లభించాయని, అదేవిధంగా హన్మకొండ జిల్లా కాజీపేటలోని మడికొండ, మెట్టుగుట్ట మీద జైన మత ఆనవాళ్లు కనిపించాయని, ఇప్పుడు అనేశ్వరమ్మ గుట్టపై కనిపించిన శాసనం తెలంగాణలో మూడోదని తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ఈ బృందంలో రాగి మురళి, చిక్కుల యాదగిరి, ఆలయ సంరక్షకుడు సల్ల సైదులు ఉన్నారు.

అన్నేశ్వరమ్మ గుట్టపై జైన శాసనం ఆనవాళ్లు