
యాదగిరిగుట్ట ఆలయానికి ఎక్సలెన్స్ అవార్డు
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం తెలగాణ టూరిజం ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికై ంది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవంలో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని శిల్పారామంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఆలయ ఈఓ జి. రవి ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓలు గజవెల్లి రఘు, జూశెట్టి కృష్ణ పాల్గొన్నారు.
నాగార్జునసాగర్: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం మీడియా, ప్రమోషన్స్ మేనేజర్, స్థపతి దేశరాజు శ్యాంసుందర్‌రావు టూరిజం అవార్డు అందుకున్నారు. తెలంగాణ చారిత్రక పర్యాటకం అనే అంశంపై బాలచెలిమి మాసపత్రికలో శ్యాంసుందర్‌రావు రాస్తున్న వ్యాసాలకు గాను శనివారం హైదరాబాద్‌లోని శిల్పారామంలో నిర్వహించిన కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిన్నారి వైద్యానికి ఎమ్మెల్యే
రాజగోపాల్‌రెడ్డి సాయం
మునుగోడు: మునుగోడు మండలం కోతులారం గ్రామ పంచాయతీ కార్యదర్శి కుమారుడు రిషి(ఏడాది లోపు వయస్సు) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని శుక్రవారం మునుగోడుకు వచ్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి స్థానిక ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు చెప్పగా.. ఆయన ఆ చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల నగదును కుటుంబ సభ్యులకు పంపించారు. ఆస్పత్రి ఖర్చులన్నీ తానే అందిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేకు పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

యాదగిరిగుట్ట ఆలయానికి ఎక్సలెన్స్ అవార్డు