హాలియాలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
హాలియా: 51వ జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను డిసెంబర్ 2, 3, 4 తేదీల్లో హాలియా పట్టణంలోని టైమ్స్ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ జి. కర్తయ్య, కో కన్వీనర్ ఆర్. భూలోకరావు తెలిపారు. బుధవారం స్థానిక టైం స్కూల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ పోటీల్లో తెలంగాణలోని 33 జిల్లాల నుంచి బాలికల టీంలు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హార్డ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బి. వెంకటరత్నం, రాష్ట్ర టెక్నికల్ సభ్యులు సీహెచ్. డొమినిక్, జిల్లా కోశాధికారి చంద్రయ్య, టైం పాఠశాల కరస్పాండెంట్ మంద నరేందర్‌రెడ్డి, కోటిరెడ్డి, పాటు కార్యవర్గ సభ్యులు యడవెల్లి రాంబాబు, ఎండీ అన్వర్‌ఖాన్, సత్య నారాయణ, పరమేష్, పరిక సైదులు తదితరులు ఉన్నారు.


