కడప అర్బన్ : కడపకు చెందిన జాహ్నవి అనే విద్యార్థిని మణిపూర్ రాష్ట్రంలో తీవ్ర భయాందోళనకు గురవుతోంది. అక్కడ జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో.. ఆమె ఉంటున్న హాస్టల్‌లోని విద్యార్థినులు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. దీంతో జాహ్నవి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కడప మృత్యుంజయకుంటకు చెందిన వెంకటరమణ, సుస్మితకు ఇద్దలు కుమార్తెలు. పెద్దకుమార్తె జాహ్నవి కడపలో ఇంటర్ పూర్తి చేసి నీట్ రాసింది.
గతేడాది మణిపూర్‌లో ఎంబీబీఎస్‌లో సీటు వచ్చింది. ఇల్‌పాల్ నగరం నీట్ క్యాంపస్‌లో చదువుతోంది. ఆమెతోపాటు మిగిలిన విద్యార్థినులు కూడా హాస్టల్‌కే పరిమితం కావడంతో సరైన సౌకర్యాలు లేక మరింత ఆందోళన చెందుతున్నారు.
ఈ విషయమై జాహ్నవి చెల్లెలు వైష్ణవి విలేకర్లకు సమాచారం అందించారు. తన సోదిరి ఉన్న హాస్టల్ సమీపంలో అర కిలోమీటర్ దూరంలో పేలుడు జరిగినట్లు చెప్పుకొచ్చిందని, ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు ఫోన్‌లో తెలియజేసిందన్నారు. అక్కడి సంఘటనలు చూస్తే తమకు చాలా భయంగా ఉందని, ఇక్కడికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment