సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్/మైదుకూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 18న మైదుకూరులో పర్యటించే అవకాశం ఉన్న నేపధ్యంలో అఽధికారులతో సమన్వయంతో పనిచేసి పర్యటన విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్‌లో జేసీ అదితి సింగ్, డిఆర్వో విశ్వేశ్వర నాయుడులతోపాటు జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు చేయాలని విధులను కేటాయించిన అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయడంతోపాటు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంభందిత అధికారులను ఆదేశించారు. జెడ్పీ సీఈవో ఓబులమ్మ, కడప, జమ్మలమడుగు, బద్వేలు ఆర్డీఓ లు జాన్ ఇర్వీన్, సాయిశ్రీ, చంద్రమోహన్, కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, ఇన్‌ఛార్జి సీపీఓ హజ్రతయ్య, డీఆర్డీఏ, డ్వామా, ఐసీడీఎస్ పీడీలు ఇతర అధికారులు పాల్గొన్నారు.
హెలిప్యాడ్, ఏర్పాట్ల పరిశీలన: మైదుకూరులో సీఎం పర్యటించే ప్రాంతాలను, హెలిప్యాడ్‌ను ఇన్‌చార్జి ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలసి కలెక్టర్ పరిశీలించారు. మైదుకూరులోని కోర్టు సమీపంలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌తోపాటు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను, స్థానిక ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానాన్ని వారు పరిశీలించారు. జిల్లాలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అమలు తీరు పర్యవేక్షణలో భాగంగా సీఎం మైదుకూరులో పర్యటిస్తున్నట్లు ఈసందర్భంగా కలెక్టర్ తెలిపారు. జేసీ అదితి సింగ్, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, డీపీఓ రాజ్యలక్ష్మి, బద్వేలు, కడప ఆర్డీఓలు చంద్రమోహన్, జాన్ ఇర్విన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment