చిన్నమండెం : చిన్నమండెం మండలం మల్లూరు, కొత్తపల్లె గ్రామాల సరిహద్దు మాండవ్యనది ఒడ్డున ఉన్న మల్లూరమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడం ఇటీవలే అమ్మవారి జాతర వైభవంగా జరగడంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. అదే విధంగా మల్లూరమ్మ తల్లి ఆలయ హుండీలను లెక్కించగా రూ.2,93,890 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ కొండారెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రమాదాల్లో
ఇద్దరికి గాయాలు
మదనపల్లె సిటీ/బి.కొత్తకోట : రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటనలు ఆదివారం జరిగాయి. బి.కొత్తకోట మండలం గొళ్లపల్లి పంచాయతీ కనికలతోపుకు చెందిన షేక్ మౌలాలి(35) పేపర్‌బాయ్‌గా పని చేస్తున్నాడు. ఉదయం పేపర్ ద్విచక్రవాహనంలో వేస్తుండగా ఎదురుగా వచ్చి కారు ఢీకొనడంతో గాయపడ్డాడు. స్థానికులు గమనించి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. గుర్రంకొండ మండలం చెరువుముందరపల్లెకు చెందిన నారాయణ (45) ద్విచక్రవాహనంలో కలకడ క్రాస్ వద్ద వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.


