చింతకుంటలో పిడుగు
ముద్దనూరు : మండలంలోని చింతకుంటలో శనివారం ఓ టెంకాయ చెట్టుపై పిడుగు పడింది. సాయంత్రం కురిసిన అకాలవర్షంలో చెట్టుపై పిడుగుపడి పాక్షికంగా దెబ్బతినింది. జనావాసాలకి కొంచెం దగ్గరలోనే ఈ పిడుగు పడడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే చెట్టుపై పిడుగుపడడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు.
వీధి కుక్కల స్వైర విహారం
– ఆరుగురిని కాటేసిన శునకాలు
కమలాపురం : మండలంలోని పెద్దచెప్పలి, ఎల్లారెడ్డిపల్లె గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేసి ఆరుగురిని గాయపరిచాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పెద్దచెప్పలితో పాటు ఎల్లారెడ్డిపల్లెలో ఉన్న కుక్కలు మనుషులపై దాడి చేశాయి. ఎల్లారెడ్డిపల్లెకు చెందిన వెంకట లక్షుమ్మ ఇంటి ముందు కసువు ఊడ్చుతుండగా కుక్క వచ్చి కాలు పట్టుకొని కాటేసింది. అలాగే పెద్దచెప్పలిలో ఆడుకుంటున్న చిన్నారులు రెహమాన్, కావేరిపై కుక్కలు దాడి చేశాయి. వారితో పాటు మరో ముగ్గురికి కూడా కుక్కులు కరిచి గాయాలు చేశాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన వారంతా కమలాపురం సీహెచ్‌సీకు చేరుకుని వైద్య సేవలు పొందారు. గ్రామంలో వీధి కుక్కలు ఎక్కువయ్యాయని, వాటిని తొలగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. కాగా పెద్దచెప్పలి, ఎల్లారెడ్డిపల్లెకు చెందిన ఆరు మందికి వైద్య సేవలు అందించినట్లు కమలాపురం సీహెచ్‌సీ వైద్యులు తెలిపారు.
చింతకుంటలో పిడుగు


