రేపు మైదుకూరులో జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

రేపు మైదుకూరులో జాబ్‌మేళా

Mar 27 2025 12:31 AM | Updated on Mar 27 2025 12:29 AM

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు మైదుకూరు పట్టణంలోని పోరుమామిళ్లరోడ్డులో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పేటీఎం సంస్థలో ఫీల్డ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులో డిప్యూటీ ఆఫీసర్‌, ఆఫీసర్‌, సీనియర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు, ఛానల్‌ ప్లే లిమిటెడ్‌ సంస్థలో అసెంబుల్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులు టెన్త్‌, ఇంటర్మీడియేట్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ చేసి ఉండాలన్నారు. 18–35 మధ్య వయస్సుగల వారు అర్హులని, ఎంపికై న వారికి హోదాను బట్టి రూ.10–18 వేల వరకు వేతనం ఉటుందన్నారు. ఆసక్తి, అర్హగతగల అభ్యర్థులు విద్యార్హతల ధృవపత్రాలు, ఫోటోలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.

ఇరువురిపై కేసు నమోదు

పులివెందుల రూరల్‌ : పులివెందుల మండలం కొత్తపల్లె గ్రామంలో భూ తగాదాల విషయమై జయరామిరెడ్డి, శివప్రసాద్‌రెడ్డిలు గొడవ పడ్డారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వీరిరువురికి గ్రామంలో భూ తగాదాల కారణంగా పాత కక్షలను మనస్సులో పెట్టుకుని బుధవారం మాట మాటా పెరిగి గొడవపడ్డారని పోలీసులు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నారాయణ తెలిపారు.

వివాహిత అదృశ్యం

కొండాపురం : మండల పరిధిలోని చౌటిపల్లె గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి కనిపించడం లేదని కొండాపురం ఎస్‌ఐ విద్యాసాగర్‌ తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు వివాహిత మహిళ ఆదిలక్ష్మి ఈ నెల 23 వతేదీన ఇంటిలో తాడిపత్రికి వెళుతున్నా అని చెప్పి వెళ్లింది. ఇప్పటి వరకు కనిపించలేదని ఆమె మామ వి. ఓబులేసు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

రాయల్‌ సొసైటీ ఆఫ్‌ కెమిస్ట్రీ ఫెలోగా డాక్టర్‌ బుసిరెడ్డి సుధాకర్‌ రెడ్డి

కడప ఎడ్యుకేషన్‌ : కడప ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), భౌతిక శాస్త్ర విభాగంలోని మెటీరియల్‌ ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ బుసిరెడ్డి సుధాకర్‌ రెడ్డి రాయల్‌ సొసైటీ ఆఫ్‌ కెమిస్ట్రీ ఫెలోగా ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి. రవీంద్రనాథ్‌ తెలిపారు. ఆయన పరిశోధనకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌), రాష్ట్రీయ ఉత్చతార్‌ శిక్షా అభియాన్‌ (ఆర్‌యుఎస్‌ఏ) వంటి అత్యున్నత ప్రభుత్వ నిధుల సంస్థల నుంచి మద్దతు లభించిందన్నారు. ఈ సందర్భంగా, ప్రిన్సిపాల్‌తో పాటు వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం. రమేష్‌, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ బి. రామచంద్ర, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వెంకట సుబ్బయ్య, బోధన, బోధనేతర సిబ్బంది డాక్టర్‌ బి. సుధాకర్‌ రెడ్డిని అభినందించారు.

పది భౌతికశాస్త్రం పరీక్షకు 27730 మంది హాజరు

కడప ఎడ్యుకేషన్‌ : పదవ తరగతి పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన భౌతికశాస్త్ర పరీక్షకు 27730 మంది హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 161 పరీక్షా కేంద్రాల్లో రెగ్యులర్‌లకు సంబంధించి 27877 మంది విద్యార్థులకుగాను 27730 మంది విద్యార్థులు హాజరుకాగా 147 మంది గైర్హాజరయ్యారు. అలాగే ప్రైవేటుకు సంబంధించి 191 మందికి 172 మంది హాజరుకాగా 19 మంది గైర్హాజరయ్యారు. 13 మంది ప్‌లైౖయింగ్‌ స్వాడ్‌ బృందాలు 70 పరీక్షా కేంద్రాలను, సిట్టింగ్‌ స్క్వాడ్‌ 88 పరీక్షా కే ంద్రాలను తనిఖీ చేసినట్లు డీఈఓ షేక్‌ షంషుద్దీన్‌ తెలిపారు. అలాగే డీఈఓ షేక్‌ షంషుద్దీన్‌ నాలుగు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా, కడప జిల్లా అబ్జర్వర్‌ మధుసూదన్‌రావు 5 పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పాఠశాల విద్య ఆర్‌జేడీ కాగిత శ్యాముల్‌ కడప నగరంలో రెండు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.

లక్ష గృహాలకు సోలార్‌ రూఫ్‌ టాప్‌ ఏర్పాటే లక్ష్యం

– జిల్లా విద్యుత్‌ శాఖ సూపరింటెండింగ్‌

ఇంజినీర్‌ ఎస్‌.రమణ

కడప కార్పొరేషన్‌ : ప్రధానమంత్రి సూర్య ఘర్‌ యోజన పథకం ద్వారా వైఎస్సార్‌ కడప జిల్లాలో లక్షమంది వినియోగదారులకు సోలార్‌ రూఫ్‌ టాప్‌ ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా విద్యుత్‌ శాఖ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ ఎస్‌. రమణ అన్నారు. బుధవారం కడప విద్యుత్‌ భవన్‌లోని తన ఛాంబర్‌లో సంస్థాపన వెండర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కిలోవాట్‌ సామర్థ్యానికి రూ. 30 వేలు, రెండు కిలోవాట్స్‌ సామర్థ్యానికి రూ. 60 వేలు, 3 కిలోవాట్‌ సామర్థ్యానికి రూ.78వేలు చొప్పున ప్రభుత్వం రాయితీ అందిస్తుందన్నారు. రాయితీ పోను మిగిలిన మొత్తానికి బ్యాంకులు తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తాయన్నారు. బీ, సీ కేటగిరీ వారికి సోలార్‌ రూఫ్‌ టాప్‌ ఏర్పాటుకు అదనంగా మరో రూ.20వేలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ గృహాలపై సోలార్‌ రూఫ్‌ టాప్‌ అమర్చుకోవాలన్నారు. ఈ సమావేశంలో నెడ్‌ క్యాప్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ యల్లారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ మోహన్‌, జూనియర్‌ ఇంజినీర్‌ సుధీర్‌, సంస్థాపక వెండర్స్‌ పాల్గొన్నారు.

రేపు మైదుకూరులో జాబ్‌మేళా   1
1/1

రేపు మైదుకూరులో జాబ్‌మేళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement