కలసపాడు : మండలంలోని కొండపేటకు చెందిన జోసెఫ్ (42) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు జోసెఫ్ గొర్రెలను మేపుకుంటుండేవాడు. కొంత మంది వద్ద అప్పు చేసి గొర్రెలను కొనుగోలు చేసేవాడు. నెలకు, రెండు నెలలకు గొర్రెలు చనిపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య సునీత, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి
కలసపాడు : మండలంలోని లింగారెడ్డిపల్లె గ్రామానికి చెందిన కొత్తపల్లె రాజారెడ్డి (45) మంగళవారం రాత్రి శంఖవరం, లింగారెడ్డిపల్లె గ్రామాల మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు రాజారెడ్డి తన సొంత పని నిమిత్తం పోరుమామిళ్లకు తన ద్విచక్ర వాహనంలో వెళుతుండగా టేకూరుపేటకు చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై లింగారెడ్డిపల్లెకు వెళుతూ శంఖవరం, లింగారెడ్డిపల్లె గ్రామాల మధ్యలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రాజారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతునికి భార్య సుధాదేవి, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరోసారి కూలిన
చౌదరివారిపల్లె వంతెన
బ్రహ్మంగారిమఠం : మండలంలో చౌదరివారిపల్లె నుంచి పలుగురాళ్లపల్లె మీదుగా సిద్దయ్యమఠం– పోరుమామిళ్లకు వెళ్లే ఆర్‌అండ్ బీ రహదారి చౌదరివారిపల్లె దగ్గర ఉన్న వంతెన మళ్లీ కూలింది. మూడు నెలల క్రితం వంతెన కూలడంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేయించారు. వాహనాల రాకపోకలు అధికం కావడంతో బుధవారం మళ్లీ వంతెన కూలింది. దీంతో ఎర్రంపల్లె, బొగ్గులవారిపల్లె, బాకరాపేట, పలుగురాళ్లపల్లె, కొత్తపల్లె, జౌకుపల్లె, ముడుమాల, సిద్దయ్యమఠం తదితర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
వంతెన నిర్మాణం కోసం
రూ.4.50 లక్షలు మంజూరు
వంతెన నిర్మాణం కోసం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆర్‌అండ్‌బీ అధికారుల ద్వారా రూ.4.50 లక్షల నిధులు మంజూరు చేయించారని టీడీపీ మండల అధ్యక్షడు చెన్నుపల్లె సుబ్బారెడ్డి తెలిపారు. త్వరలోనే వంతెన నిర్మాణ పనులు చేపడతారన్నారు.
గొర్రెల యజమాని ఆత్మహత్య
గొర్రెల యజమాని ఆత్మహత్య


