దాల్మియా పరిశ్రమతో వెలువడే బూడిత, కెమికల్ వాసన పీల్చడంతో నా కుమారుడికి క్యాన్సర్ వచ్చి మరణించినాడు. 1.75 ఎకరాల భూమిని సాగుచేసుకుందామంటే పొలాల్లో నీరు వచ్చి చేరుతోంది.
అప్పులు పెరిగిపోవడంతో బయట పనులకు పోతున్నాం. వంకలకు అడ్డంగా దాల్మియా పరిశ్రమ గోడలు కట్టడంతో మా పొలాలకు నీరు చేరుతోంది. నా కుమారుడి మరణానికి పరిశ్రమ యజమానులే కారణం.
– శాంతమ్మ, దుగ్గనపల్లి, మైలవరం మండలం
ముందు మా సమస్యలు పరిష్కరించాలి
2007లో దాల్మియా పరిశ్రమ ఎర్పడినప్పటి నుంచి నవాబుపేట, దుగ్గనపల్లి రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. వంకల్లో పరిశ్రమ కట్టడంతోపాటు ప్రహరీ నిర్మాణం చేపట్టారు. వంకలో చేరాల్సిన 33 వేల క్యూసెక్కుల నీరు మా గ్రామాలను ముంచేస్తున్నాయి. బ్లాస్టింగ్‌తో ఇళ్లు దెబ్బతిన్నాయి. గతంలో ఏడుగురు ఇంటిపై నుంచి పడి మరణించారు. మా సమస్యల పరిష్కరించిన తర్వాత విస్తరించాలి.
– భాస్కర్‌రెడ్డి, నవాబుపేట, మైలవరంర మండలం


