ఎంపీటీసీ నుంచి జెడ్పీ చైర్మన్‌ దాకా.. | - | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీ నుంచి జెడ్పీ చైర్మన్‌ దాకా..

Mar 28 2025 1:37 AM | Updated on Mar 28 2025 1:33 AM

బ్రహ్మంగారిమఠం : మైదుకూరు నియోజకవర్గంలో వెనుకబడిన బ్రహ్మంగారిమఠం మండలం నుంచి రాజకీయాల్లో రాణిస్తున్నారు రామగోవిందరెడ్డి. ఎంపీటీసీగా ఎన్నికై రాజకీయాల్లో పట్టు సాధించిన ఆయన నేడు జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మండలంలోని పలుగురాళ్లపల్లె పంచాయతీ జౌకుపల్లె గ్రామానికి చెందిన ముత్యాల పిచ్చిరెడ్డి మునుసూబుకు 1962 ఫిబ్రవరి, ఒకటో తేదీన ముత్యాల రామగోవిందరెడ్డి జన్మించారు. ఆయన విద్యాభ్యాసం ఒక టి నుంచి ఐదో తరగతి వరకు జౌకుపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఆరు నుంచి పదో తరగతి వరకు పలుగురాళ్లపల్లె జెడ్పీ హైస్కూల్‌లో కొత్తపల్లెకు చెందిన పుట్టా సుధాకర్‌యాదవ్‌ (ఎమ్మెల్యే)తో కలిసి ఆయన చదువుకున్నారు. ప్రస్తుతం పుట్టా పెద్ద కుమారుడుడు వేలూరు ఎంపీగా ఉన్నారు. పోరుమామిళ్లలో ఇంటర్మీడియట్‌ చదివి తరువాత 1984లో 23 ఏళ్లలో క్లాస్‌–1 కాంట్రాక్టర్‌గా పనులు చేపట్టారు. 2006లో అప్పటి కాంగ్రెస్‌ పార్టీ తరపున పలుగురాళ్లపల్లె ఎంపీటీసీగా ఏకగ్రీవమయ్యారు. మాజీ సీఎం జగన్‌, ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రఘురామిరెడ్డిల ఆధ్వర్యంలో 2014లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు, బి.మఠం జెడ్పీటీసీగా పొటీచేసి టీడీపీ అభ్యర్థి చెంచయ్యగారిపల్లెకు చెందిన పోలిరెడ్డిపై 5000 మెజార్టీతో గెలిచాడు, అప్పుడే జెడ్పీ చైర్మన్‌ కోసం ప్రయత్నాలు చేసినా దక్కలేదు. 2019లో మళ్లీ జెడ్పీటీసీగా పొటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. రాజకీయ సమీకణాలతో అప్పటి సీఎం జగన్‌ రాజంపేటకు అవకాశం ఇచ్చారు. అనంతరం నేడు ఆయన జెడ్పీ చైర్మన్‌గా అవకాశం దక్కింది. ఇదే పంచాయతీలో మరొరు ఎమ్మెల్యేగా ఉంటే ఈయన జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికవడం విశేషం. 40మంది జెడ్పీటీసీల సభ్యుల ఆమోదంతో జెడ్పీ చైర్మన్‌ పీఠం ఎక్కారు. రామగోవిందరెడ్డికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉండగా అందరికీ వివాహమైంది.

పట్టు సాధించిన

ముత్యాల రామగోవిందరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement