పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యం

Mar 29 2025 12:48 AM | Updated on Mar 29 2025 12:49 AM

– జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్‌ కుమార్‌

కడప అర్బన్‌ : పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్‌ కుమార్‌ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు ‘గ్రీవియన్స్‌ డే’ నిర్వహించా రు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లు , ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది బదిలీలు, వ్యక్తిగత , స్పౌజ్‌, చిల్డ్రన్‌న్‌, మెడికల్‌ సమస్యల గురించి ఎస్పీకి స్వయంగా విన్నవించుకున్నారు. ఎస్పీ సిబ్బంది సమస్యలను విని, వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపుతామని భరోసా కల్పించారు.

పంచాయతీ కార్యదర్శిపై దాడి అమానుషం

ప్రొద్దుటూరు రూరల్‌ : వీరపునాయునిపల్లె పంచాయతీ కార్యదర్శి నాగభూషణ్‌రెడ్డి ఇంటిపై కొందరు దుండగులు దాడి చేయడం అమానుషమని మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం ఉపాధ్యక్షుడు మస్తాన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు వారు శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు జరగకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఉన్నతాధికారులు భరోసా ఇవ్వాలన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్‌ బాలన్నకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం మహిళా ఉపాధ్యక్షురాలు శిరీష, జనరల్‌ సెక్రటరీ సుహాసిని, అడిషనల్‌ సెక్రటరీ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం నగరంలోని హోచిమన్‌ భవన్‌లో ఏపీ ఆశా వర్కర్‌ యూనియన్‌ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాలకు ఇచ్చిన హామీలకు జీవోలు విడుదల చేయాలన్నారు. వేతనాలు పెంచాలని, సాధారణ సెలవులు, ఉద్యోగ భద్రత, మెడికల్‌ ఉద్యోగులుగా గుర్తించి పెర్మనెంట్‌ చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షలు, స్మార్ట్‌ ఫోన్లు, రూ. 10 లక్షల రూపాయల ఉచిత ప్రమాద ఇన్సూరెన్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలపై ఏప్రిల్‌ 1వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఉద్యమ కార్యచరణ ప్రకటించామన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నగర అధ్యక్షులు సుబ్బరాయుడు, ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నగర ప్రధాన కార్యదర్శి బి శాంతమ్మ పాల్గొన్నారు.

వాహనం ఢీకొని

వృద్ధురాలు మృతి

కడప అర్బన్‌ : ఉక్కాయిపల్లి సమీపంలోని బైపాస్‌ రోడ్డు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందినట్లు కడప ట్రాఫిక్‌ సీఐ జావిద్‌ తెలిపారు. సీఐ వివరాల మేరకు మృతి చెందిన వృద్ధురాలుకు 65 సంవత్సరాలు వయసు ఉంటుందని, గురువారం రాత్రి నడుచుకుంటూ వెళుతున్న ఆమెను వాహ నం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించినట్లు తెలిపారు. మృతురాలి సంబంధీకులు వివరాలకు 91211 00539 లేదా కడప ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ వచ్చి వివరాలు తెలుసుకోవాలని కోరారు.

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యం   1
1/2

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యం

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యం   2
2/2

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement