బ్రౌన్ భవన నిర్మాణ పనులు ప్రారంభించండి
కడప కల్చరల్ : సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం నూతన భవన నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని గ్రంథాలయ సలహా మండలి సభ్యులు జానుమద్ది విజయభాస్కర్ విజ్ఞప్తి చేశారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు విచ్చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కడప నగరంలోని బ్రౌన్ గ్రంథాలయ నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలనిలాయనకోరారు. 2023 డిసెంబర్‌లో నాటి ప్రభుత్వం రూ.6.87 కోట్ల నిధులు మంజూరు చేసిందని, పలు కారణాలతో ఆగిపోయాయని తెలిపారు. ముఖ్యమంత్రి చొరవచూపి భవన నిర్మాణం ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు. కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరిని కలిసి విజ్ఞప్తి చేశారు.
ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ తనిఖీ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్‌కుమార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉమెన్స్ హెల్ప్ డెస్క్‌పై సిబ్బందికి సూచనలు చేశారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అనంతరం స్టేషన్ పరిసరాలు పరిశీలించి స్టేషన్ ఆవరణంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పెండింగ్ కేసులు త్వరగా విచారించి పరిష్కరించాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, కోదండరాముడి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయాలని ఆయన ఆదేశించారు.
మహిళపై హత్యాయత్నం విఫలం
ఖాజీపేట : మహిళను హత్య చేసేందుకు వచ్చిన దుండగులు.. ఆమె గట్టిగా కేకలు వేయడం, స్థానికులు రావడంతో పరారయ్యారు. పత్తూరు గ్రామంలో ఒకరిని, రైస్ మిల్లు వద్ద ఒకరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన చోటు సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.పుల్లూరు పంచాయతీ పరిధిలోని బంగ్లా సమీపంలో భాగ్య అనే మహిళ ఉంది.. ఆమె వడ్డీ వ్యాపారాలతో పాటు, రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తోంది. ఆమెను హత్య చేసేందుకు రాత్రి వేళ సుమారు 10 మంది యువకులు ద్విచక్రవాహనాల్లో వచ్చారు. ఇంటి తాళం పగుల కొట్టే ప్రయత్నం చేశారు. వీరిని చూసిన భాగ్య కారు డ్రైవర్‌కు ఫోన్ చేసింది. గట్టిగా కేకలు వేసింది. దీంతో డ్రైవర్ శివ అక్కడికి చేరుకున్నాడు. స్థానికులు కర్రలు తీసుకుని దుండగులపై దాడికి ప్రయత్నిచారు. దీంతో వారు బైక్‌లు అక్కడే వదిలి పరారయ్యారు. డ్రైవర్ శివ ఒకరిని పట్టుకున్నారు. రైస్‌మిల్లు వద్ద మరొకరిని గ్రామస్తులు పట్టుకుని తీసుకొచ్చారు. వచ్చిన వారంతా అక్కడే బైక్‌లను వదిలి పరారైయ్యారు.
దేహశుద్ధి
పారిపోతున్న వారిలో ఒకరిని పత్తూరు గ్రామంలో, మరొకరిని రైస్ మిల్లు స్థానికులు పట్టుకున్నారు. దొరికిన వారు కత్తులు చూపి భయపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పట్టుకున్న తర్వాత ఎందుకొచ్చారని స్థానికులు ప్రశ్నించారు.చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు.. విషయం పోలీసులకు తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న చెట్టుకు కట్టేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అసలు ఎందుకు వచ్చారు.. హత్య కోసమేనా లేక ఇతర పనుల కోసం వచ్చారా అన్న విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
● స్థానికులు రావడంతో పరారీ
● పత్తూరులో దొరికిన నిందితులు
● వారి వద్ద నుంచి కత్తులు స్వాధీనం
బ్రౌన్ భవన నిర్మాణ పనులు ప్రారంభించండి
బ్రౌన్ భవన నిర్మాణ పనులు ప్రారంభించండి


