ఉత్కంఠగా బండలాగుడు పోటీలు
బ్రహ్మంగారిమఠం : మండలంలోని సిద్ధయ్యమఠంలో పెద్దపీరయ్యస్వామి ఆరాధన మహోత్సవాలలో భాగంగా సోమవారం ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలను జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఆద్యంతం పోటీలు ఉత్కంఠగా సాగాయి. నంద్యాలకు చెందిన కేశవరెడ్డి ఎద్దులు ప్రథమ స్థానంలో నిలవగా యజమానికి రూ.1,00,116 నగదు జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి అందజేశారు. ప్రొద్దుటూరుకు చెందిన మార్తల వెంకటరెడి ఎద్దులు ద్వితీయ స్థానంలో నిలవగా యజమానికి రూ.70 వేల నగదు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన ఎద్దుల యజమానులకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వీరనారాయణరెడ్డి, మండల పార్టీ అధ్యక్షడు మేకల రత్నకుమార్‌యాదవ్, బొగ్గల సుబ్బిరెడ్డి, రామసుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి చిన్న ఓబుల్‌రెడ్డి, నేలటూరు వెంకటరామిరెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, గొడ్లవీడు నాగేశ్వర్‌రెడ్డి, దుగ్గిరెడ్డి, బాలిరెడ్డి, గుండాపురం రమణారెడ్డి, గొడ్లవీడు సిద్దారెడ్డి, జోగయ్య, రామకృష్ణారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు చెన్నుపల్లె సుబ్బారెడ్డి, కానాల మల్లికార్జునరెడ్డి, జౌకుపల్లె రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


