లెదర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి
బద్వేలు అర్బన్ : మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లె రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 1580/బిలో చర్మకారుల సొసైటీకి కేటాయించిన 3.64 ఎకరాల స్థలంలో లెదర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. బుధవారం బద్వేలు పర్యటనకు వచ్చిన ఆయన ఆర్డీఓ చంద్రమోహన్, తహసీల్దారు ఉదయభాస్కర్‌రాజుతో కలిసి సొసైటీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి సొసైటీ సభ్యులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత కోసం లెదర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి చర్మకారులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ లిడ్‌క్యాప్ డైరెక్టర్ రాజశేఖర్, చర్మకారుల సొసైటీ సభ్యులు, దళిత ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.


