● ఎన్నికల అధికారికి గుండెపోటు వచ్చేలా....
తొలి రోజు వాయిదా పడిన ఎన్నిక మరుసటి రోజైన 28న నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు సమాయత్తమైతే వారిపైనే దౌర్జన్యానికి దిగి ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డికి గుండెపోటు వచ్చేలా చేశారు. ఇదంతా కూడా డీఎస్పీ సమక్షంలోనే చోటుచేసుకున్నా ఈ రోజు వరకు కేసు నమోదు కాలేదు. ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి సోదరుడు నంద్యాల అనందభార్గవరెడ్డి మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య కుమారుడు ప్రతాప్, మాజీ జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి ఎన్నికల గదిలోకి ప్రవేశించి దౌర్జన్యానికి దిగారు. టీడీపీకి చెందిన వారు ఎన్నికల అధికారి వద్ద ఉన్న డాక్యుమెంట్లను చించేశారు. కుర్చీలు ఎత్తేసి భయబ్రాంతులకు గురిచేశారు. దీంతో సదరు ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డికి గుండెపోటు వచ్చింది. ఇప్పుడా వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నా యి. ఇంత తతంగం తెరపైకి వచ్చినా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
సాక్షి ప్రతినిధి, కడప: సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే చాలు... గోడలు దూకి మరీ అరెస్టులు చేసే పోలీసులు...ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఎన్నికల్లో దౌర్జన్యం, దాడులకు దిగితే చూస్తుండిపోయారు. వైఎస్సార్సీపీ సభ్యులపై దాడు లు చేసి.. ఫేక్ ఐడీ కార్డులతో ఎన్నికను తారుమా రు చేయాలనుకున్నా.. మౌనాన్నే ఆశ్రయించారు. ఎన్నికలు రూమ్‌లోకి వెళ్లి ఎన్నికల అధికారిపైనే దౌర్జన్యానికి దిగినా నో కేస్. చివరికి ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి సోదరుడు చేసిన దౌర్జన్యానికి ఎన్నికల అధికారికి గుండె పోటు కూడా వచ్చినా నో కేస్. ఇదీ.. కూటమి పాలనలో ఖాకీల పనితీరు.
● ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ చేయని అరాచకం లేదు. సాక్షాత్తు డీఎస్పీ ముందే ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి సోదరుడు అనందభార్గవ్‌రెడ్డితోపాటు పలువురు టీడీపీ నేతలు ఎన్నికల అధికారిపై దౌర్జన్యానికి దిగితే కనీసం కేసు కూడా లేదు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో టీడీపీ దౌర్జన్యకాండను కళ్లకు కట్టినట్లు బహిర్గతం చేశాయి. ఎటువంటి బలం లేని కారణంగా ఎలాగైనా ఉప సర్పంచ్ ఎన్నికను అడ్డుకునేందుకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి బంధువు లు చేయని అరాచకం లేదు. మార్చి 27న వైఎస్సార్సీపీ సభ్యులు ఎన్నికకు వస్తుంటే వారి వాహనంపై దాడి చేసి, మహిళా సభ్యులను సైతం గాయపరిచి ఎన్నికకు రాకుండా అడ్డుకున్నారు. అదే రోజు ఎలాగైనా గెలవాలని నలుగురు వ్యక్తులకు ఫేక్ ఐడీ కార్డులు సృష్టించి ఎన్నిక గదిలోకి పంపినా వారిని కనీసం అదుపులోకి కూడా తీసుకోలేదు. సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను అపహాస్యం చేసే విధంగా వారు వ్యవహరిస్తే చట్టపరమైన చర్యల్లేవు.
ఎన్నికల కమీషన్ ఆదేశాలకే దిక్కులేదు...
20 మంది వార్డు మెంబర్లు ఉన్న గోపవరం పంచాయితీలో ఉప సర్పంచ్ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలకే జిల్లాలో దిక్కులేకుండా పోయింది. ఎన్నికకు సంబంధం లేని తెలుగుదేశం నాయకులు ఎన్నికల రూమ్‌లోకి ప్రవేశించారు. పోలీసు అధికారులు సైతం అదే వీడియోలో కన్పిస్తున్నారు. అయినా నియంత్రించలేదు. పోలీసుల కళ్లముందే దౌర్జన్యానికి దిగినా వారికి కనిపించలేదు. మరోవైపు ‘ఒక్క ఫోన్ కొడితే చాలు న్యాయం చేస్తా’మని ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ ప్రకటించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు చేపట్టిన 20 మంది వార్డు మెంబర్లు ఉన్న ఎన్నికల్లో అరాచకం తాండవించినా చట్టపరమైన చర్యలు లేకపోవడం ఎస్పీ ప్రకటనను ప్రశ్నాకర్థంగా మారుస్తోంది. ఆలస్యంగా వీడియోలు బయటకు రావడంతో చిన్న ఉప సర్పంచ్ పదవి కోసం టీడీపీ నేతలు చేసిన దౌర్జన్యకాండ వెలుగు చూసింది. ఇప్పటికై నా జిల్లా పోలీసు యంత్రాంగం చట్టాన్ని పరిరక్షించేందుకు ముందుండాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు.
అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం తాపత్రయం
ఎన్నికల కమీషన్ ఆదేశాలు ఉల్లంఘించినా కేసుల్లేవు
గోపవరం ఉపసర్పంచ్ ఎన్నికలో ప్రజాస్వామ్యం అపహాస్యం
ఫేక్ ఐడీలతో పట్టుబడినా చర్యల్లేవ్
‘దేశం’ నేతలు కావడంతోచట్టపరమైన చర్యలకు వెనుకంజ
ఖాకీ వనంలో కలుపు మొక్కలు!
ఖాకీ వనంలో కలుపు మొక్కలు!
ఖాకీ వనంలో కలుపు మొక్కలు!


