ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6వ తేదీ నుంచి 14 వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 వరకు అంకురార్పణ శాస్త్రోక్తంగా నిర్వహిచనున్నారు. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణ ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఆశీనులు చేస్తారు. అనంతరం టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు రాజేష్ కుమార్ ఆగమ శాస్త్రం ప్రకారం అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఆలయంలోని పుట్టమన్నును యాగశాలకు తీసుకెళ్లే కార్యక్రంమతో అంకుకార్పణ ముగుస్తుంది.
రేపు ధ్వజారోహణం
ఏప్రిల్ 6న ధ్వజారోహణంతో శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 7 నుండి 9 వరకు శేష వాహనసేవ జరగనున్నాయి.
● ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. గోపురాలు, కల్యాణ వేదిక, ఇతర ప్రాంతాల్లో విద్యుత్‌దీపాలు అమర్చారు.
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ


