మోడల్ పరీక్షలోనూ మహిళలదే ఆధిపత్యం
కడప అర్బన్ : కడప బార్ అసోసియేషన్‌లో శనివారం నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జి మోడల్ పరీక్షలో ఎనిమిది మంది మహిళలు ఆధిపత్యం సాధించడమేగాక అధిక మార్కులు సొంతం చేసుకున్నారు. కడప భారత న్యాయవాదుల సంఘం అధ్యక్షులు సి.సుబ్రహ్మణ్యం వర్కింగ్ ప్రెసిడెంట్ టి.ఈశ్వర్ ముందుగానే ప్రకటించడంతో 40 మంది న్యాయవాదులు హాజరయ్యారు. ఈ మోడల్ పరీక్ష శనివారం ఉదయం 11 గంటల నుండి ఒంటిగంట వరకు జరిగింది. కడప బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి ప్రధాన కార్యదర్శి చంద్రవదన, ఉపాధ్యక్షులు ఉమాదేవి ప్రశ్నపత్రం విడుదల చేశారు. వంద ప్రశ్నలతో కూడిన పరీక్ష పూర్తవగానే కీ విడుదల చేశారు. షేక్ ముస్తఫాకు 86, సి.రాజ్యలక్ష్మికి 84, ఎ.రాహుల్‌కు 80 మార్కులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నాగసుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, వెంకటశివ, సురేష్, చిన్నయ్య పాల్గొన్నారు.


