అరటితోటలో 300 మొక్కలు దగ్ధం
కొండాపురం : మండల పరిధిలోని వెంకయ్య కాలువ గ్రామానికి చెందిన ఎస్.శంకర్‌రెడ్డి అరటి తోటలో 300 మొక్కలు దగ్ధమైన సంఘటన రెండు రోజుల కిందట జరిగింది. రైతు వివరాల మేరకు... తోట సమీపంలోని బీడు భూమిలో ఎండిన గడ్డికి అగ్గిపెట్టడంతో నిప్పు రవ్వలు అరటితోటలో పడ్డాయి. దీంతో సుమారు 300 మొక్కలు కాలిపోయాయి. మొక్కలు గేల వేసే సమయంలో ఈ ఘటన జరగడంతో సుమారు రూ.2లక్షల నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. రైతును ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పర్యావరణంపై అవగాహన ఉండాలి
కడప ఎడ్యుకేషన్ : విద్యార్థి దశ నుంచే పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలని నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా కోర్డినేటర్(ఎన్జీసీ) టీవీ.రమణయ్య సూచించారు. ఏపీ ఎన్జీసీ, పర్యావరణ విద్య సౌజన్యంతో నేచర్ క్యాంపు శనివారం నిర్వహించారు. పొలతలలో జిల్లా నుంచి వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు వృక్ష, జంతు సంబంధమైన విషయాలపై అవగాహన కల్పించారు. స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించి పర్యావరణంపై క్విజ్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు కడప పదో తరగతి మూల్యాంకన కేంద్రంలో డీఈఓ షంషుద్దీన్, కడప ఉప విద్యా శాఖాధికారి రాజగోపాల్‌రెడ్డి సర్టిఫికెట్, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ కోఆర్డినేటర్స్ విజయమోహన్‌రెడ్డి, దానం, రవీంద్ర, సూర్యచంద్ర రెడ్డి, అహల్యాభాయి తదితరులు పాల్గొన్నారు
ఈత సరదా తీసింది ప్రాణం
పులివెందుల రూరల్ : మండు టెండల్లో ఉపశమనం కోసం సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు, ఓ విద్యార్థికి అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందిన వైనం శనివారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. పులివెందుల మండలం అచ్చివెళ్లి పంచాయతీ పరిధిలోని కానేపల్లె గ్రామానికి చెందిన సుబ్బరాయుడి కుమారుడు శివ(26) పులివెందుల పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాడు. తన ఇంటి సమీపంలో కుంట వద్దకు శనివారం సరదాగా ఈత కొట్టడానికి వెళ్లారు. ఈ సమయంలో అతడికి ఫిట్స్ రావడంతో నీటిలో మునిగి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పెద్ద దిక్కుగా మారిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు.
ముమ్మడిగుంటపల్లెలో మరొకరు..
సిద్దవటం : మండలంలోని ముమ్మడిగుంటపల్లె వ్యవసాయ పొలాల్లోని బావిలో ఈతకు వెళ్లి ఫిట్స్ రావడంతో మరో విద్యార్థి మృతి చెందాడు. బంధువుల కథనం మేరకు.. ఒంటిమిట్ట మండలం చొన్నకొత్తపల్లె గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి తమ్మిశెట్టి శ్రీనివాసులు(16) శనివారం మధ్యాహ్నం గ్రామస్తులు, స్నేహితులతో కలిసి ముమ్మడిగుంటపల్లె వ్యవసాయ పొలాల్లోని బావిలో ఈత కోసం వెళ్లారు. బావిలో ఈత కొట్టి బయటకు రాగానే శ్రీనివాసులుకు ఫిట్స్ రావడంతో అక్కడికకక్కడే మృతిచెందారు.
వడదెబ్బతో దివ్యాంగుడు మృతి
రాజంపేట రూరల్ : ఎండ వేడిమి అధికం కావడంతో వడదెబ్బ సోకి దివ్యాంగుడు కుల్లూరు నరసింహులు(38) శనివారం మృత్యువాత పడ్డారు. పట్టణ శివారులోని డీబీఎన్‌పల్లి అరుంధతి వాడకు చెందిన కుల్లూరు చిన్న నరసింహులు, రంగమ్మలకు ఆరుగురు సంతానం. తల్లిదండ్రులు మరణించడంతో పెద్ద కుమారుడు శ్రీనివాసులు బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇతనికి తోడుగా దివ్యాంగులైన నరసింహులు, చెంగలరాయుడు బేల్దారి పనికి వెళ్తున్నారు. ఈ క్రమంలో నరసింహులుకు శుక్రవారం నుంచి విరేచనాలు, వాంతులయ్యాయి. శనివారం తీవ్రం కావడంతో తన గృహంలో కుప్పకూలిపోయాడు. హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే డీ హైడ్రేషన్ కారణంగా నరసింహులు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని ఆయన బంధువు మహేశ్వరి తెలిపారు. దాతలు ఆదుకోవాలని కోరారు.
రెండు జేసీబీలు, ట్రాక్టర్ సీజ్
కలికిరి : అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు జేసీబీలు, ఒక ట్రాక్టరును సీజ్ చేసినట్లు సీఐ రెడ్డిశేఖర్‌రెడ్డి తెలిపారు. పోలీసుల కథనం మేరకు... మండలంలోని మేడికుర్తి పరిధిలోని బాహుదానదిలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జేసీబీలతో ట్రాక్టర్లకు ఇసుక వేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. నదిలో ఉన్న రెండు జేసీబీలను, ఒక ట్రాక్టరును సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం తహశీల్దారుకు అప్పగించనున్నట్లు చెప్పారు.
ఏఎల్‌సీసీ మూవీ టీజర్ రిలీజ్
కురబలకోట : ఏఎల్‌సీసీ(ఓ యూనివర్సల్ బ్యాచిలర్) మూవీ టీజర్‌ను అంగళ్లు వద్ద విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఫంక్షన్‌లో విశ్వం విద్యా సంస్థల అధినేత ఎం.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్‌ఆర్ ఫిల్మ్ సర్క్యూట్స్ బ్యానర్‌పై నిర్మించిన ఏఎల్‌సీసీ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చిత్ర హీరో జెపి.నవీన్, దర్శక, నిర్మాత కోలా లెలీదర్‌రావుకు గుర్తింపు రాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. హీరో నవీన్, నటులు శ్రీనివాసరెడ్డి, ధనుష్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.రమణారెడ్డి, ఎఎల్‌సీసీ చిత్ర బృందం పాల్గొన్నారు.
అరటితోటలో 300 మొక్కలు దగ్ధం
అరటితోటలో 300 మొక్కలు దగ్ధం
అరటితోటలో 300 మొక్కలు దగ్ధం


