చర్లపల్లి–తిరుపతి మధ్య ప్రత్యేక రైలు
కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాదులోని చర్లపల్లి–తిరుపతి (07017– 07018) మధ్య ప్రత్యే రైలును ప్రవేశపెట్టినట్లు కడప రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ఈ రైలు ఈనెల 6, 11, 13, 18, 20, 25, 27, మే 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30 తేదీల్లో చర్లపల్లి నుంచి తిరుపతికి బయలుదేరుతుందన్నా రు. అలాగే తిరుపతి నుంచి ఈనెల 7, 12, 14, 19, 21, 26, 28, మే 3, 5, 10, 12, 17, 19, 24, 26 31 తేదీల్లో నడుస్తుందని పేర్కొన్నారు. ఈ రైలు ప్రతి శుక్ర, ఆదివారాల్లో చర్లపల్లిలో రాత్రి 9.35 గంటలకు, తిరుపతిలో సోమ, శనివారాలలో సాయంత్రం 4.40 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఈ రైలు మల్కాజ్‌గిరి, కాచిగూడ, హుందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తిరోడ్డు, గద్వాల్, కర్నూలుసిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట మీదుగా రాకపోకలు సాగిస్తుందని తెలిపారు. ప్రయాణికులు ముందస్తుగా తమ టిక్కెట్లను ముందుగానే రిజర్వు చేసుకోవాలని సూచించారు.


