రిజిస్ట్రేషన్‌కు 19 స్లాట్ బుకింగ్‌లు
కడప కోటిరెడ్డిసర్కిల్ : స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ సేవలను మరింత సులభతరం చేసేందుకు స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అన్ని జిల్లాల్లో కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకువచ్చా రు. కడప అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తికి దస్తావేజులను అందజేశారు. సోమవారం 19 స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి దస్తావేజులను అందజేసినట్లు సబ్ రిజిస్ట్రార్ హరికృష్ణ తెలిపారు. కొత్త విధానంతో ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఎక్కువ సమయం వృథా కాదని, ప్రజలు నిరీక్షించే బాధ తగ్గుతుందన్నా రు. అలాగే క్యూఆర్ కోడ్‌తోనూ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు తమ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచామన్నారు.


