11లోపు అభ్యంతరాలు తెలపాలి
కడప ఎడ్యుకేషన్: రాయలసీమ పరిధిలోని అనంతపురం, చిత్తూరు, వైఎస్‌ఆర్, కర్నూలు పూర్వపు జిల్లాలలోని స్కూల్ అసిస్టెంట్(గవర్నమెంట్) నుంచి గ్రేడ్ –2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు(గవర్నమెంట్) తాత్కాలిక జాబితా వెబ్‌సైట్ https:/rjdsekadapa.blogspot.com లో ఉంచినట్లు పాఠశాల విద్య ఆర్‌జేడీ కాగిత శ్యాముల్ తెలిపారు. కావున ఏవైనా అభ్యంత రాలు ఉన్నచో సంబంధిత జిల్లా విద్యాశాఖ అధి కారి కార్యాలయాల్లో తగిన ఆధారాలతో ఈ నెల 11లోపు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు.
పరిహారం అందించేందుకు కృషి
పులివెందుల రూరల్: నియోజకవర్గంలో పది రోజుల క్రితం వీచిన ఈదురు గాలులు, వర్షాలకు దెబ్బతిన్న అరటి రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆమె జేసీ అతిథి సింగ్‌తో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించే విధంగా నివేదికలు తయారు చేయాలని సూచించారు. నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
బిషప్ పట్టాభిషేకానికి
పోప్ దూత రాక
కడప కల్చరల్: కడప కథోలిక డయాసిస్ నూతన బిషప్‌గా మోస్ట్‌రెవరెండ్ సగినాల పాల్ ప్రకాష్ బుధవారం పట్టాభిషిక్తులు కానున్న సందర్భంగా.. ముఖ్య అతిథిగా ప్రపంచ క్రైస్తవ గురువు పోప్ దూత లియో ఫోల్డ్ జిరెల్లీ హాజరు కానున్నారు. మంగళవారం ఆయన కడప నగరానికి వచ్చేశారు. ఆరోగ్యమాత, కథడ్రల్ చర్చిలను దర్శించుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన ఊరేగింపుగా భక్తులతో కలిసి కథడ్రిల్ చర్చికి వచ్చేశారు. మరియామాత, క్రీస్తు ప్రభువుకు ప్రార్థనలు చేశారు. విశ్వాసులు మాతను నిత్య జపం చేయాలని, కుటుంబ ప్రార్థనలు చేయాలని మార్గ దర్శనం చేశారు. కార్యక్రమంలో నల్గొండ బిషప్ ఎండీ ప్రసాద్‌రావు, ఆరోగ్యమాత మదర్ సరేనా, ఏఐసీయూ ప్రధాన కార్యదర్శి స్వామినాథన్, ఇతర గురువులు, మదర్లు, సంఘ పెద్దలు పాల్గొన్నారు.
రెచ్చగొట్టేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలి
కడప అర్బన్: మనోభావాలను దెబ్బతీయడమే గాకుండా, రెచ్చగొట్టే విధంగా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మంగళవారం కడప ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ అమర్‌నాథ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి ఎస్‌బీ అంజాద్‌బాషా సోదరుడు ఎస్‌బీ అహ్మద్‌బాషాను కడప పోలీసులు ముంబయిలో అరెస్టు చేసి తీసుకువస్తున్నారని, ఆయన ఇంటి సమీపంలోని గోకుల్ సర్కిల్‌లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకున్నారని పేర్కొన్నారు. టీడీపీ నేతలు ఆర్.వి సుబ్బారెడ్డి (పాలెంపల్లి సుబ్బారెడ్డి), యువరాజ్, పఠాన్ ఖాజాపీర్, జియావుద్దీన్, పాలంపల్లి రాజా, ఆరీఫ్, సయ్యద్ ఫైజల్ వీరితోపాటు ఆ పార్టీకి సంబంధించిన 200 మంది అరగంటపాటు బాణాసంచా కాల్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. కడప నగరంలో పోలీస్ 30 యాక్ట్ అమలులో వున్నా.. దాన్ని పాటించలేదన్నారు. ఫిర్యాదు చేసిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలలో బంగారు నాగయ్య యాదవ్, రమేష్‌రెడ్డి, సుదర్శన్ రాయల్, నందలూరు ఫయాజ్, బి.హెచ్ ఇలియాస్ (వైఎస్‌ఆర్‌సీపీ గల్ఫ్ కన్వీనర్), టి.టి.డి బోర్ట్ మాజీ సభ్యులు యానాదయ్య, వైఎస్‌ఆర్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు జాషువా, కార్పొరేటర్ కె.బాబు తదితరులు ఉన్నారు.
11లోపు అభ్యంతరాలు తెలపాలి
11లోపు అభ్యంతరాలు తెలపాలి


