విరిగిన విద్యుత్ స్తంభం
కొండాపురం : మండల పరిధిలోని లావనూరు గ్రామంలో ఇళ్ల సమీపంలో విద్యుత్‌స్తంభం ఒక్కసారిగా విరిగిపడింది. ఆ సమయంలో ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. ఐదు రోజుల క్రితం ఈదురు గాలులు వీయడంతో విద్యుత్ స్తంభం ఒరిగింది. అది మంగళవారం ఉన్నట్లుండి విరిగి పడిపోయింది. పెను ప్రమాదం తప్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ సిబ్బంది వచ్చి నూతన స్తంభాన్ని ఏర్పాటు చేశారు.
వరదయ్యగారిపల్లి ఆలయంలో చోరీ
రాజంపేట : మండలంలోని వరదయ్యగారిపల్లి అక్కమ్మతల్లి ఆలయంలో చోరీ జరిగింది. మంగళవారం ఈ విషయాన్ని మన్నూరు సీఐ కులాయప్ప తెలిపారు.హుండీలు పగులకొట్టి అందులో నగదును తీసుకెళ్లిన దృశ్యాలను సీసీ ఫుటేజ్ ఆధారంగా రికార్డు చేశామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. క్లూస్ టీమ్ కూడా ఆలయాన్ని పరిశీలించిందన్నారు.
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి తీరని లోటు
రాయచోటి : విధులపట్ల ఎంతో నిబద్ధత కలిగిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.రమాను కోల్పోవడం జిల్లాకు తీరని లోటని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్‌లోని పిజిఆర్‌ఎస్ హాల్‌లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమా సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి అధికారిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ఆమె నిబద్ధత గురించి సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ చెప్పడంతోనే పీజీఆర్‌ఎస్‌కు స్పెషల్ ఆఫీసర్‌గా నియమించినట్లు తెలిపారు. ఈమె నియామకం తరువాత పిజిఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంలో అన్నమయ్య జిల్లా ఎంతో వృద్ధి సాధించిందని పేర్కొన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అత్యుత్తమ పనితీరును కనబరిచిన వ్యక్తి రమ అన్నారు. ఆమె ఎంతో మృదు స్వభావి, నిజాయితీగల అధికారిణి అని కొనియాడారు. సమావేశంలో డీఆర్‌ఓ మధుసూదనరావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, రాయచోటి తహసీల్దార్ నరసింహ కుమార్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సహదేవరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి చంద్రనాయక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
విరిగిన విద్యుత్ స్తంభం
విరిగిన విద్యుత్ స్తంభం
విరిగిన విద్యుత్ స్తంభం


